`భారత్ శక్తిని ప్రపంచానికి చాటిన ఘనత బీజేపీదే`
రాంచీ: అణుపరీక్షలు జరిపి భారత్ శక్తిని ప్రపంచానికి చాటిన ఘనత బీజేపీదేనని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఆనాడు ఆంక్షలు విధించినా అభివృద్ధి ఆగలేదని ఆయన చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని రాజ్‌నాథ్‌సింగ్ ఆరోపించారు. ధరల నియంత్రణ చేయడం యూపీఏ ప్రభుత్వానికి చేతకావడం లేదని ఆయన విమర్శించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ తన వద్ద మంత్రదండం లేదని అంటున్నారని రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. అయితే లోక్‌పాల్ బిల్లు అమలు ఘనత అన్నా హజారేకు చెందుతుందని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు.