ప్రియాదత్ పై పోటీ చేయడం లేదు: ప్రీతి జింటా | Preity Zinta says not contesting elections | Sakshi
Sakshi News home page

ప్రియాదత్ పై పోటీ చేయడం లేదు: ప్రీతి జింటా

Published Tue, Mar 4 2014 6:49 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ప్రియాదత్ పై  పోటీ చేయడం లేదు: ప్రీతి జింటా - Sakshi

ప్రియాదత్ పై పోటీ చేయడం లేదు: ప్రీతి జింటా

రానున్న లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బాలీవుడ్ తార ప్రీతి జింటా స్పష్టం చేశారు.  కాంగ్రెస్ పార్టీ తరపున లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను జింటా ఖండించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాదత్ పై భారతీయ జనతా పార్టీ తరపున పోటీకి సిద్దమవుతున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆమె అన్నారు. 
 
నార్త్, సెంట్రల్ ముంబై నియోజకవర్గంలో ప్రియా దత్ పై ప్రీతి జింటాను పోటీకి దింపాలనే ఆలోచనలో బీజేపీ ఉందనే వార్తలు మీడియాలో వచ్చాయి. ట్విటర్ లో ఓ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు సీరియస్ గా స్పందించారు. ఆ వార్త ఎక్కడ చదివావు. ఆ కథనాన్ని ప్రింట్ చేసిన పేపర్ చింపేయ్. ఆవార్తలో వాస్తవం లేదు అని ప్రీతి ట్వీట్ చేసింది. 
 
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపీఎల్ జట్టకు సహ భాగస్వామి ఉన్న ప్రీతి జింటా స్వంత బ్యానర్ పై ఇష్క ఇన్ పారిస్ అనే చిత్రాన్ని నిర్మించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement