
మళ్లీ అధికారంలోకి వస్తాం
భారతీయ జనతాపార్టీ ప్రజలకు కలల ప్రపంచం చూపించి మభ్యపెట్టిందని, దాంతో వారు ఆ పార్టీ ఉచ్చులో చిక్కుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియూ గాంధీ అన్నారు.
న్యూఢిల్లీ: భారతీయు జనతాపార్టీ ప్రజలకు కలల ప్రపంచం చూపించి మభ్యపెట్టిందని, దాంతో వారు ఆ పార్టీ ఉచ్చులో చిక్కుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియూ గాంధీ అన్నారు. తవు పార్టీ వుళ్లీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీవూ వ్యక్తంచేశారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయుంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళా కాంగ్రెస్ సదస్సులో ఆమె ప్రసంగిస్తూ, నరేంద్రమోడీ సర్కారుపై తీవ్ర వివుర్శలు గుప్పించారు. మహిళల రిజర్వేషన్లకోసం తమ పార్టీ పోరాడుతుందని ఆమె తెలిపారు. కాగా సోనియా వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. దేశ ప్రజలను కలల ప్రపంచం చూపించింది సోనియానేనపేర్కొంది.