దేశంలోనే కాదు రాష్ట్రంలో సైతం దూసుకెళుతున్న భారతీయ జనతా పార్టీని అడ్డుకునే కుట్రలు మొదలయ్యూయి. పార్టీ ప్రచార కార్యక్రమాలకు మోకాలడ్డటం ద్వారా లబ్ధి పొందేందుకు ఏకంగా న్యాయస్థానాన్నే ఆశ్రయించారు. ఫిబ్రవరి 8న చెన్నై వండలూరులో నిర్వహించనున్న మోడీ ప్రచారసభపై స్టే మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి : శీతాకాలపు చలి రాష్ట్రాన్ని వీడకముందే లోక్‌సభ ఎన్నికల వేడి మొదలైంది. మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండగా రాష్ట్రంలోని పార్టీల పొత్తు చర్చలు ఒక కొలిక్కిరాలేదు. కొన్ని పార్టీలు తెరవెనుక, మరికొన్ని పార్టీలు తెరముందు పొత్తుల చర్చల్లో తలమునకలై ఉన్నాయి.
దాదాపు అన్ని పార్టీలు అనధికారికంగా ఒక అభిప్రాయానికి వచ్చినా డీఎండీకే అధినేత విజయకాంత్ ఇంకా ఎటూ తేల్చక పోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. అన్ని పార్టీలు కెప్టెన్‌తో జతకట్టేందుకు సంసిద్ధత ప్రకటించినా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడిచేయడంలో సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు. డీఎండీకే కోసం ఒక వైపు కాంగ్రెస్, మరోవైపు డీఎంకే గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, మధ్యలో తన్నుకు పోయేందుకు బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది.
రాష్ట్రంలోని రెండు ప్రాంతీయ పార్టీ (ఎండీఎంకే, పీఎంకే)లను దాదాపుగా తన ఖాతాలో వేసుకున్న బీజేపీ ఇక పూర్తి దృష్టిని డీఎండీకేపై పెట్టింది. ఈనెల 8న వండలూరులో నిర్వహించనున్న మోడీ సభా వేదికపై ఎలాగైనా విజయకాంత్‌ను కూర్చోబెట్టాలన్న బలమైన సంకల్పంతో బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది.
మోడీ సభపై కుట్ర
Published Sat, Feb 1 2014 3:11 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement