గంట కూడా విశ్రాంతి తీసుకోను | rest of the hour | Sakshi
Sakshi News home page

గంట కూడా విశ్రాంతి తీసుకోను

Apr 9 2016 2:02 AM | Updated on May 28 2018 3:58 PM

గంట కూడా విశ్రాంతి తీసుకోను - Sakshi

గంట కూడా విశ్రాంతి తీసుకోను

భారతీయ జనతా పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తీసుకువచ్చేంతవరకూ గంట పాటు కూడా నిద్రపోనని ఆ పార్టీ

బెంగళూరు: భారతీయ జనతా పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తీసుకువచ్చేంతవరకూ గంట పాటు కూడా నిద్రపోనని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడుగా నియమితులైన యుడ్యూరప్ప పేర్కొన్నారు. తనను పార్టీ కర్ణాటక రాష్ట్రాధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు పార్టీ జాతీయాధ్యక్షుడైన అమిత్‌షాను ఢిల్లీలోని ఆయన నివాసంలో శుక్రవారం కలుసుకుని యడ్డీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన పై నమ్మకం ఉంచి అధ్యక్షస్థానం కల్పించిన పార్టీ పెద్దల నిర్ణయాన్ని వమ్ముచేయనన్నారు. 2018లో

 
కర్ణాటకలో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తానని తెలిపారు. ఇందు కోసం ప్రతిక్షణం కష్టపడుతానని తెలిపారు. పార్టీ నాయకులందరినీ ఏకతాటి పై తీసుకువచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళుతానని స్పష్టం చేశారు. తన పై వచ్చిన అవినీతి ఆరోపనల్లో చాలా వరకూ కోర్టులు కొట్టేసాయన్నారు. ఒకటి రెండు కేసుల్లో కూడా తాను నిర్దోషినని తేలుందని యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు.  ఇదిలాఉండగా శుక్రవారం రాత్రి ఆయన బెంగళూరు చేరుకున్నారు.పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. యడ్యూరప్ప మాట్లాడుతూ శనివారం నుంచి రాష్ర్ట వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement