10 జిల్లాల తెలంగాణకే కట్టబడి ఉన్నాం: కిషన్ రెడ్డి | Telangana of 10 Districts with Hyderabad, says G. Kishan Reddy | Sakshi
Sakshi News home page

10 జిల్లాల తెలంగాణకే కట్టబడి ఉన్నాం: కిషన్ రెడ్డి

Published Fri, Nov 8 2013 12:02 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

10 జిల్లాల తెలంగాణకే కట్టబడి ఉన్నాం: కిషన్ రెడ్డి - Sakshi

10 జిల్లాల తెలంగాణకే కట్టబడి ఉన్నాం: కిషన్ రెడ్డి

పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని భారతీయ జనతాపార్టీ కేంద్రం హోం మంత్రిత్వ శాఖకు శుక్రవారం రాసిన లేఖలో స్పష్టం చేసింది. తెలంగాణ బిల్లు వీలైనంత త్వరగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది. విభజన వల్ల తలెత్తే సమస్యలను కేంద్రమే పరిష్కరించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖలో రాసిన లేఖలో పేర్కొంది.

 

నీటి పంపకాలు, ప్రజా భద్రత, ఉద్యోగ తదితర అంశాల్లో స్పష్టత ఇవ్వాలని బీజేపీ సూచించింది. తెలంగాణ బిల్లు ఎప్పటిలోగా తీసుకువస్తారో కేంద్రం ప్రకటించకపోవడం పట్ల బీజేపీ కాసింత ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే విభజన వల్ల తలెత్తే సమస్యలను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో కూడా చెప్పాలని బీజేపీ మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.  తెలంగాణ ఏర్పాటుపై పూర్తి స్థాయి నివేదికతో కేంద్రం ముందుకు రావాలని కేంద్రం హోంశాఖకు రాసిన లేఖలో కిషన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement