హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో కొంతకాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న సిపిఐ, సిపిఎం పార్టీలు ఎట్టకేలకు భేటీ అయ్యాయి. రాష్ట్రంలో సిపిఎంతో కలిసి పనిచేసే పరిస్థితి లేదని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి న్యూఢిల్లీలో ప్రకటించి 48 గంటలు కూడా కాకముందే ఉభయ పార్టీల నేతలు గురువారమిక్కడ భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో అవగాహనతో పోటీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరోసారి సమావేశం కావాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు అవగాహనతో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరోసారి భేటీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చిస్తామని ఆయన చెప్పారు. సీసీఐ, సీపీఎం పొత్తుల మధ్య సాంకేతిక ఇబ్బందులు లేవని నారాయణ తెలిపారు.
'మున్సిపల్లో పొత్తు కుదిరింది'
Published Thu, Mar 13 2014 2:22 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement
Advertisement