
వారు అసమర్థులా.. వీరు సమర్థులా
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై సీపీఎం నేత బీవీ రాఘవులు స్పందించారు. లోకేష్ కోసమే మంత్రి వర్గ విస్తరణ చేపట్టారని ఆయన విమర్శించారు.
'మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మంత్రి పదవి పోయిన వారు అసమర్థులా.. లేక కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారు సమర్థులా' అని రాఘవులు ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు అన్యాయం అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చేసింది న్యాయమా అని రాఘువులు ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు నేతలకు మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే.