
‘భూకుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే’
విజయవాడ: ఇద్దరు మంత్రుల మధ్య తగాదా పెట్టి భూ కుంభకోణం పై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని సీపీఎం నాయకులు రాఘవులు అన్నారు. ఈ అంశంపై సిట్ దర్యాప్తు సరిపోదని సీబీఐ విచారణ చేపడితే అసలు నిజాలు బయటికొస్తాయన్నారు.
రాఘువులు సోమవారం ఉదయం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హుద్ హుద్ తుఫాన్ పేరుతో రికార్డులు మాయం చేసి వేల కోట్లు విలువ చేసే భూములను దోచుకున్నారన్నారు. భూ కుంభకోణం పై రోజుకో విధంగా ప్రభుత్వం మాట్లడుతోందని విమర్శించారు. బ్యాంక్‌ల నుంచి లోన్లు తీసుకోవడానికే భూ రికార్డులు ట్యాంపర్ చేశారని డీజీపీ చెబుతున్నారని.. అయితే ఇది నేరం కాదా అని రాఘవులు ప్రశ్నించారు.