
'ఆ విమర్శలు జుగుప్సాకరంగా ఉన్నాయి'
హైదరాబాద్ : సీపీఐ నారాయణ ఆరోపణలను సీపీఎం నేత రాఘవులు తీవ్రంగా ఖండించారు. నారాయణ విమర్శలు జుగుప్సాకరంగా ఉన్నాయని ఆయన బుధవారమిక్కడ అన్నారు. తనపై చేసిన ఆరోపణలను నారాయణ రుజువు చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. నారాయణ ఆరోపణలకు తాను ప్రతి ఆరోపణలు చేయనని అన్నారు.
జాతీయ విధానాలకు అనుకూలంగా పొత్తులు పెట్టుకుంటామని రాఘవులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లేవారితో పొత్తు ఉండదని ముందే చెప్పామన్నారు. ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగిన తనను ఓడించడానికి సీపీఎం రూ. 15 కోట్లకు అమ్ముడుపోయిందంటూ నారాయణ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.