
సీఎం పిచ్చోడు.....
కడప : రాష్ట్ర విభజన బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిచ్చోడిలా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాఘవులు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని సమస్యలపై సీఎం చర్చించటం లేదని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన కడపలో విలేకర్లతో మాట్లాడుతూ బ్రహ్మణీ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తాము మాత్రమే ఉద్యమిస్తే సరిపోదని అన్ని పార్టీలు కలిసి రావాలని రాఘవులు పిలుపునిచ్చారు. రాయలసీమ జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, పారిశ్రామికీరణతోనే ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందుతుందని అన్నారు.