
నల్లధనంతో నడుస్తున్న సర్కార్: రాఘవులు
ఖమ్మం: నల్లధనాన్ని రద్దు చేసేందుకు పెద్ద నోట్లు రద్దు చేసినట్లు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ నల్లధనంతోనే నడుస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ఆరోపించారు. ఖమ్మంలోని మంచికంటి భవన్‌లో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. 50 రోజుల్లో అద్భుతం జరుగుతుందని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలపై పెనుభారం మోపారని ఆరోపించారు.