ఫ్లోరిడాలో వైఎస్ జగన్‌కు మద్దతుగా సమావేశం
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న పోరాటానికి మద్దతుగా అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాసాంధ్రులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్ చేసిన దీక్షను కొనియాడారు. విభజనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేస్తోన్న కృషి, పోరాట పటిమను పలువురు ఎన్నారైలు ప్రశంసించారు.