నేను ముమ్మాటికీ సమైక్యవాదినే: కిషోర్ చంద్రదేవ్
విజయనగరం: తాను ముమ్మాటికీ సమైక్యవాదినేనని కేంద్రమంత్రి కిశోర్‌చంద్ర దేవ్ స్పష్టం చేశారు. విజయనగరం ప్రజలు కోరితే తాను రాజీనామాచేస్తానని చెప్పారు. విభజనను అడ్డుకోవడానికి తాను ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే తనకు ఎవరూ సహకారం అందించలేదని చెప్పారు.
సీమాంధ్ర నుంచి మొత్తం 9 మంది కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పళ్ళం రాజు, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, పురంధేశ్వరి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, జేడీ శీలం, కిషోర్ చంద్రదేవ్ తలా ఒక మాట్లాడుతున్నారు. కాసేపు రాజీనామా అంటారు. మరికాసేపాగితే పార్లమెంటులో వాణి వినిపించాలంటారు. ఒకరు సోనియా తొందరపడొద్దన్నారని చెబితే, ఒకొకరు అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అంటారు. ఇప్పుడు కిషోర్ చంద్ర దేవ్ మాత్రం తాము ముమ్మాటికీ సమైక్యవాదినే అంటున్నారు. ఆయనేం చేస్తారో చూడాలి.