సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లిలో లక్ష గర్జన సమరభేరి కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక హెడ్ పోస్టాఫీసు సమీపంలోని అనిబిసెంట్ సర్కిల్ వద్ద లక్ష గర్జన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు సమైక్యవాదులు పాల్గొన్నారు.
లక్షసార్లు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేపట్టారు. అలాగే బెంగళూరు రోడ్డు, మల్లికార్జున సర్కిల్, పటేల్ రోడ్డులను దిగ్బంధం చేశారు.