
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లెలోని తారకరామ థియేటర్ వద్ద తహసీన్ అనే మహిళను గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి చంపారు. అనంతరం అక్కడినుంచి దుండగులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంట్లోనే తహసీన్‌ను దారుణంగా చంపడంతో మదనపల్లిలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.