madanapally
-
మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, అన్నమయ్య: జిల్లాలోని మదనపల్లి గ్రామ పరిధిలోని పుంగనూరు రోడ్డులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల ప్రకారం.. పుంగనూరు రోడ్డులోని 150 మైలు వద్ద కారు కల్వర్టును ఢీకొని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటంతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాద ఘటనపై స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతులందరూ మదనపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఇది కూడా చదవండి: స్నేహితుడికి నమ్మక ద్రోహం.. అంతటితో ఆగకుండా.. -
చిత్తూర్ జిల్లా మదనపల్లి లో అర్ధరాత్రి భారీ పేలుళ్లు
-
చిత్తూరు జిల్లాలో దారుణం
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లెలోని తారకరామ థియేటర్ వద్ద తహసీన్ అనే మహిళను గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి చంపారు. అనంతరం అక్కడినుంచి దుండగులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంట్లోనే తహసీన్‌ను దారుణంగా చంపడంతో మదనపల్లిలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. -
ఎన్నికల విధుల నుంచి మదనపల్లె సీఐ తొలగింపు
సాక్షి, మదనపల్లె : నిబంధనలు ఉల్లంఘించిన కేసు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. మదనపల్లె టూ టౌన్ సీఐ సురేష్ కుమార్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 2వ తేదీన మదనపల్లెలో సీఎం పర్యటన సందర్భంగా స్థానిక నిమ్మనపల్లె మార్గం లో ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు ఆహార పొట్లాలు ప్యాక్‌చేసి అందజేస్తున్నట్లు ఎన్నికల అధికారులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని రాజంపేట పార్లమెంట్ అబ్జర్వర్ నవీన్‌కుమార్ ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సమాచారాన్ని చేరవేశారు. ఆర్ఐ పల్లవి సంఘటన స్థలానికి వెళ్లి సమాచారం వాస్తవమని ధ్రువీకరించి కేసు నమోదుకు సీఐ సురేష్ కుమార్‌కు సిఫారసు చేశారు. కేసు నమోదులో సీఐ అలసత్వం కనబరిచినందుకు సీఈవో గోపాలకృష్ణ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారు. సురేష్ స్థానంలో అనంతపురం డీటీసీలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.సుబ్బరాయుడును నియమించారు. -
ప్రేమ విఫలమై...
సాక్షి, మదనపల్లె క్రైం: ప్రేమించిన అమ్మాయి దక్కలేదన్న మనస్తాపంతో ఎక్స్‌రే టెక్నీషియన్ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి రూరల్ పోలీసులు, బాధితుని కుటుంబసభ్యుల కథనం ఇలా ఉంది. వేంపల్లె పంచాయతీ దిగువకొనగంట వారిపల్లెకు చెందిన ఆర్.శ్రీరాములు కుమారుడు వెంకటరమణ(24) స్థానిక పుంగనూరు రోడ్డులోని ఓ మిషనరీ ఆసుపత్రిలో ఎక్స్‌రే టెక్నీషియన్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే ఆసుపత్రిలో పనిచేసే ఓ యువతితో మూడేళ్ల క్రితం ప్రేమలో పడ్డారు. యువతిది స్థానిక బసినికొండ కావడంతో తల్లిదండ్రులు ఉన్న ఊరిలోనే కుమార్తెను కులాంతర వివాహం చేసేందుకు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన వెంకటరమణ ఇంటిలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు బాధితుడిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్నెట్లో పిల్లలకు బ్లూఫిల్మ్స్ చూపిస్తూ..!
సాక్షి, మదనపల్లె క్రైం: మదనపల్లె పట్టణం టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా ఇందిరానగర్‌కు వెళ్లే రోడ్డు ఎంట్రన్స్‌లో ఉన్న ఓ కాంప్లక్స్‌లో ఇంటర్నెట్ నిర్వాహకులు రూ.10 ఇస్తే చాలు నీలిచిత్రాలు చూపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ విచ్చలవిడిగా ఈ వ్యవహారం సాగిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఇంటర్నెట్ సెంటర్‌పై దాడులు నిర్వహించి నోటీసులు జారీ చేసినా వారు బేఖాతరు చేయకుండా నీలిచిత్రాల నిర్వహణ యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం టూటౌన్ సీఐ సురేష్‌కుమార్‌కు అందిన సమాచారం మేరకు పోలీసులు వెళ్లి ఇంటర్నెట్ సెంటర్‌పై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో మైనర్ బాలికతో సహా, యువకులు నీలిచిత్రాలు చూస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి మందలించి పిల్లలను వారికి అప్పగించారు. అనంతరం నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐలు నాగేశ్వరావు, క్రిష్ణయ్య, షీ-టీమ్ ఏఎస్ఐ రమాదేవి, సిబ్బంది గిరిజమ్మ, సావిత్రమ్మ, శశికళ, మునికుమార్నాయక్, తేజోవతి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. -
చదివించలేదని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, మదనపల్లె క్రైం: తల్లిదండ్రులు చదివించలేమని చెప్పడంతో ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మదనపల్లెలో మంగళవారం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నక్కలదిన్నెతాండాకు చెందిన క్రిష్ణమూర్తి కుమార్తె సింధూజ(22) స్థానికంగా ఉన్న ఓ ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ చదువుతోంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా తల్లితండ్రులు సింధూజను చదువు మానేయమనడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నం చేసింది. గమనించిన ఇరుగుపొరుగువారు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సింధూజ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం
మదనపల్లి(చిత్తూరు జిల్లా): మదనపల్లిలోని తారకరామ సినిమా థియేటర్ ఎదురుగా ఉన్న బషీర్ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఐదు లీటర్ల గ్యాస్ సిలిండర్‌లోకి అక్రమంగా పెద్ద సిలిండర్ నుంచి గ్యాస్ నింపుతుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఈ మంటలకు రెండు పెద్ద సిలిండర్లు పేలాయి. దీంతో పరిసర ప్రాంతంలో ఉన్న ఇతర షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు, కారు ఢీ: ఇద్దరు మృతి
బత్తలపల్లి(అనంతపురం జిల్లా): బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు మదనపల్లి నుంచి గుంతకల్లు వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో తిరుపతి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ నాగరాజు(35), మస్తాన్(37) ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో బోయ శ్రీనివాసులు అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. -
నేడు మదనపల్లికి వైఎస్ జగన్
► మదనపల్లిలో ఎమ్మెల్యే కుమార్తె వివాహం ► పులివెందుల నుంచి కదిరి మీదుగా రాక మదనపల్లి (చిత్తూరు జిల్లా) : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సాయంత్రం మదనపల్లి రానున్నారు. మదనపల్లి శాసనసభ్యులు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి కుమార్తె కరిష్మా దేశాయ్, వరుడు లక్ష్మీకాంతరెడ్డిలను ఆశీర్వదించనున్నారు. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఉన్న వైఎస్ జగన్ సాయంత్రం 3 గంటలకు అనంతపురం జిల్లా కదిరి, నల్లచెరువు, తనపల్లి, ములకలచెరువు మీదగా మదనపల్లి చేరుకుంటారని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో భారీ స్వాగతానికి తంబళ్లపల్లి ఇన్చార్జి పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, పార్టీ ప్రముఖులు మదనపల్లి బయలుదేరుతున్నారు. -
కాబోయే భార్య కోసం వెళ్లి..
► కాబోయే భార్యను చూసేందుకు వస్తుండగా ఘటన ► ఒక్కగానొక్క బిడ్డ మృతితో తల్లడిల్లిన తల్లి మదనపల్లె(చిత్తూరు) : లారీ ఢీకొని వైఎస్ఆర్ జిల్లా యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మదనపల్లె అనపగుట్టలో ఉన్న కాబోయే భార్యను చూసేందుకు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదిలాడు. శనివారం రాత్రి గుర్రంకొండ మండలంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి సమీపంలోని సుండుపల్లె మండలం పొలిమేరపల్లె పంచాయతీ పెద్దపల్లెకు చెందిన గురిగింజకుంట సుబ్బానాయుడి కుమారుడు శివకుమార్‌నాయుడు(20)కి మదనపల్లెలోని తన అమ్మమ్మ మనవరాలు శిరీషతో ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో కాబోయే భార్యతో మాట్లాడి వస్తానని తన తల్లి రవణమ్మతో చెప్పి ఇంటి నుంచి మోటార్‌సైకిల్‌పై మదనపల్లెకు బయల్దేరాడు. మార్గమధ్యంలోని గుర్రంకొండ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ శివకుమార్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో స్పృ హతప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు ఘటనాస్థలంలోని సెల్ ఆ ధారంగా బాధితుని కుటుంబ సభ్యులకు, గుర్రంకొండ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు 108 సాయంతో హుటా హు టిన మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. చికిత్స పొందుతూ సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం కన్నుమూశాడు. ఒక్కగానొక్క బిడ్డ మృతితో రవణమ్మ తల్లడిల్లి పోయి విలపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుర్రంకొండ పోలీసులు తెలిపారు. -
భర్తతో గొడవ పడి..
మదనపల్లి రూరల్ (చిత్తూరు జిల్లా) : మదనపల్లి పట్టణంలో పి.స్వాతి(25) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబకలహాల కారణంగా భర్త చందుతో గొడవపడి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్రగాయాలపాలైన స్వాతిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మున్సిపాలిటీ అక్రమాలపై ఎమ్మెల్యే ఫిర్యాదు
మదనపల్లి రూరల్ : చిత్తూరు జిల్లా మదనపల్లి మునిసిపాలిటీ అక్రమాలపై ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి సబ్ కలెక్టర్ కృతికా బాత్రాకు సోమవారం ఫిర్యాదు చేశారు. 200 మంది కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బందికి గాను కేవలం 60 మంది కార్మికులతోనే పనులు చేయిస్తున్నారని.. ఈ రూపేణా కోటి రూపాయల మేర అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
మదనపల్లి రూరల్ : చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం మధ్యాహ్నం ఆకస్మిక సోదాలకు దిగారు. ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలతో కూడిన బృందం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందిని విచారిస్తున్నారు. దస్తావేజులు రాసేవారితో లంచాలు వసూలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు దాడులకు దిగినట్టు సమాచారం. -
మదనపల్లిలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
-
మదనపల్లిలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
చిత్తూరు : చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం నీరుగట్లపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంచుతున్న టీడీపీ కార్యకర్తలను వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ సంఘటనలో నలుగురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
మదనపల్లిలో లక్ష గర్జన సమర భేరి
సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లిలో లక్ష గర్జన సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక హెడ్ పోస్టాఫీసు సమీపంలోని అనిబిసెంట్ సర్కిల్ వద్ద లక్ష గర్జన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు సమైక్యవాదులు పాల్గొన్నారు. లక్షసార్లు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేపట్టారు. అలాగే బెంగళూరు రోడ్డు, మల్లికార్జున సర్కిల్, పటేల్ రోడ్డులను దిగ్బంధం చేశారు.