చిత్తూరు : చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం నీరుగట్లపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంచుతున్న టీడీపీ కార్యకర్తలను వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ సంఘటనలో నలుగురు వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.