గ్యాస్‌ ఫిల్లింగ్‌ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం | fire accident at gas filling centre in madanapally | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ఫిల్లింగ్‌ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం

Published Wed, Feb 8 2017 8:14 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

గ్యాస్‌ ఫిల్లింగ్‌ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం - Sakshi

గ్యాస్‌ ఫిల్లింగ్‌ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం

మదనపల్లి(చిత్తూరు జిల్లా):
మదనపల్లిలోని తారకరామ సినిమా థియేటర్‌ ఎదురుగా ఉన్న బషీర్‌ గ్యాస్‌ ఫిల్లింగ్‌ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఐదు లీటర్ల గ్యాస్‌ సిలిండర్‌లోకి అక్రమంగా పెద్ద సిలిండర్‌ నుంచి గ్యాస్‌ నింపుతుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.

ఈ మంటలకు రెండు పెద్ద సిలిండర్‌లు పేలాయి. దీంతో పరిసర ప్రాంతంలో ఉన్న ఇతర షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement