గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం
మదనపల్లి(చిత్తూరు జిల్లా):
మదనపల్లిలోని తారకరామ సినిమా థియేటర్ ఎదురుగా ఉన్న బషీర్ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఐదు లీటర్ల గ్యాస్ సిలిండర్‌లోకి అక్రమంగా పెద్ద సిలిండర్ నుంచి గ్యాస్ నింపుతుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.
ఈ మంటలకు రెండు పెద్ద సిలిండర్లు పేలాయి. దీంతో పరిసర ప్రాంతంలో ఉన్న ఇతర షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.