Four Members Killed In Road Accident At Madanapalle - Sakshi
Sakshi News home page

మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Published Thu, May 26 2022 9:41 AM | Last Updated on Thu, May 26 2022 11:16 AM

Road Accident At Madanapalle - Sakshi

సాక్షి, అన్నమయ్య: జిల్లాలోని మదనపల్లి గ్రామ పరిధిలోని పుంగనూరు రోడ్డులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. 

వివరాల ప‍్రకారం.. పుంగనూరు రోడ్డులోని 150 మైలు వద్ద కారు కల్వర్టును ఢీకొని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటంతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాద ఘటనపై స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతులందరూ మదనపల్లికి చెందిన వారిగా గుర్తించారు. 

ఇది కూడా చదవండి: స్నేహితుడికి నమ్మక ద్రోహం.. అంతటితో ఆగకుండా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement