
సాక్షి, మదనపల్లె క్రైం: మదనపల్లె పట్టణం టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా ఇందిరానగర్‌కు వెళ్లే రోడ్డు ఎంట్రన్స్‌లో ఉన్న ఓ కాంప్లక్స్‌లో ఇంటర్‌నెట్ నిర్వాహకులు రూ.10 ఇస్తే చాలు నీలిచిత్రాలు చూపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ విచ్చలవిడిగా ఈ వ్యవహారం సాగిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఇంటర్‌నెట్ సెంటర్‌పై దాడులు నిర్వహించి నోటీసులు జారీ చేసినా వారు బేఖాతరు చేయకుండా నీలిచిత్రాల నిర్వహణ యధావిధిగా కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం టూటౌన్ సీఐ సురేష్‌కుమార్‌కు అందిన సమాచారం మేరకు పోలీసులు వెళ్లి ఇంటర్‌నెట్ సెంటర్‌పై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో మైనర్ బాలికతో సహా, యువకులు నీలిచిత్రాలు చూస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇవ‍్వడంతో పాటు వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి మందలించి పిల‍్లలను వారికి అప్పగించారు. అనంతరం నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐలు నాగేశ్వరావు, క్రిష్ణయ్య, షీ-టీమ్ ఏఎస్‌ఐ రమాదేవి, సిబ్బంది గిరిజమ్మ, సావిత్రమ్మ, శశికళ, మునికుమార్‌నాయక్, తేజోవతి, శ్యామల తదితరులు పాల్గొన‍్నారు.
Comments
Please login to add a commentAdd a comment