Internet Centers
-
ఇంటర్నెట్లో పిల్లలకు బ్లూఫిల్మ్స్ చూపిస్తూ..!
సాక్షి, మదనపల్లె క్రైం: మదనపల్లె పట్టణం టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా ఇందిరానగర్‌కు వెళ్లే రోడ్డు ఎంట్రన్స్‌లో ఉన్న ఓ కాంప్లక్స్‌లో ఇంటర్నెట్ నిర్వాహకులు రూ.10 ఇస్తే చాలు నీలిచిత్రాలు చూపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ విచ్చలవిడిగా ఈ వ్యవహారం సాగిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఇంటర్నెట్ సెంటర్‌పై దాడులు నిర్వహించి నోటీసులు జారీ చేసినా వారు బేఖాతరు చేయకుండా నీలిచిత్రాల నిర్వహణ యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం టూటౌన్ సీఐ సురేష్‌కుమార్‌కు అందిన సమాచారం మేరకు పోలీసులు వెళ్లి ఇంటర్నెట్ సెంటర్‌పై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో మైనర్ బాలికతో సహా, యువకులు నీలిచిత్రాలు చూస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి మందలించి పిల్లలను వారికి అప్పగించారు. అనంతరం నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐలు నాగేశ్వరావు, క్రిష్ణయ్య, షీ-టీమ్ ఏఎస్ఐ రమాదేవి, సిబ్బంది గిరిజమ్మ, సావిత్రమ్మ, శశికళ, మునికుమార్నాయక్, తేజోవతి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్నెట్ సెంటర్లపై పోలీసుల దాడులు
ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్నెట్ సెంటర్లను నిర్వహిస్తున్న యజమానులపై రాజేంద్రనగర్ పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం... స్టేషన్ పరిధిలో కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్నెట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కానీ ఇంటర్నెట్ సెంటర్ ఏర్పాటుకు స్థానిక పోలీస్‌స్టేషన్, జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకోవాలి. అలాగే సెంటర్‌కు వచ్చే వారి పేరు, ఐడీ కార్డును తప్పని సరిగా రికార్డులో పొందుపరచాలి. ఈ నిబంధనలను ఊల్లంగించి హైదర్ గూడ, అత్తాపూర్, శివరాంపల్లి ప్రాంతాలలో ఏడు ఇంటర్నెట్ సెంటర్లు వినియోగిస్తున్నారు. ఆదివారం ఉదయం రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ ఉమేందర్ ఆధ్వర్యంలో ఈ సెంటర్లపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు. -
‘నెట్టే’ట్లో ముంచారు
ఏలూరు :తొలి విడతలో రూ.50 వేల లోపు రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆ వివరాలను వెబ్సైట్లో ఉంచినట్టు బ్యాంకులకు సమాచారం అందించింది. రైతులంతా ఆశతో వెబ్సైట్లను వెతుకుతుంటే గుండెలు గుభేల్మంటున్నాయి. సోమ, మంగళవారాల్లో జాబితాలను చూసుకున్న రైతులు అందులోని సమాచారమంతా మాయాజాలంగా ఉందని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు రూ.50 వేల రుణమాఫీకి ఎంతమంది రైతులు అర్హులనేది తేల్చడం అధికారులకు చిక్కుముడిగానే ఉంది. ఈ వివరాలను నిగ్గు తేల్చేందుకు మూడు రోజులుగా అధికారులు, బ్యాంకర్లు కుస్తీ పడుతూనే ఉన్నారు. మొదటి దఫాగా రూ.50వేల లోపు రుణమాఫీ అయ్యే వారి సంఖ్య తక్కువగానే ఉంటుందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను బయటకు వెల్లడిస్తే ప్రతిపక్షాలు ఎదురు దాడికి దిగుతాయనే భయం సర్కారును వెంటాడుతోంది. ఈ దృష్ట్యా ఇందుకు సంబంధించిన వివరాలను బయటకు పొక్కనివ్వొద్దంటూ బ్యాంకర్లకు ఆదేశాలు అందాయని చెబుతున్నారు. దీంతో రైతులు ఎవరికి వారు ఇంటర్నెట్ సెంటర్లు, నెట్ కనెక్షన్ అందుబాటులో ఉన్న వ్యక్తుల వద్దకు వెళ్లి వ్యక్తిగతంగా రుణమాఫీ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఏ ఒక్క బ్యాంకు, సొసైటీల వద్ద రుణమాఫీ జాబితాలను రైతుల పరిశీలన కోసం పెట్టిన దాఖలాలు లేవు. ఖాతాలతో కుస్తీ పడుతున్న డీసీసీబీ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) 32 శాఖలతోపాటు, వాటి పరిధిలో 257 సొసైటీలు ఉన్నారుు. సొసైటీలు, డీసీసీబీ శాఖల ద్వారా రూ.50 వేల లోపు రుణమాఫీకి ఎంతమంది రైతులు అర్హుల య్యూరు, ఎంతమంది రైతులకు 20 శాతం మేర రుణమాఫీ అవుతుందనే గణాంకాలను తేల్చే పనిలో డీసీసీబీ ఉద్యోగులు నిమగ్నమయ్యూరు. డీసీసీబీ సీఈవో వీవీఎన్ ఫణికుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తోంది. పీడీఎఫ్ ఫార్మాట్లో ఇచ్చిన సమాచారాన్ని ఎక్సెల్ ఫార్మాట్లోకి మార్పు చేసి, రైతుల ఆధార్ నంబర్ వారీగా వివరాలను క్రోడీకరిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నానికి ఈ కార్యక్రమం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని డీసీసీబీ వర్గాలు చెబుతున్నారుు. డీసీసీబీ పరిధిలో 2 లక్షల మంది ఖాతాదారులు ఉండగా, వారికి రూ.954 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి గతంలోనే నివేదించారు. కాగా, లీడ్ బ్యాంకు పరిధిలోని 510 వాణిజ్య శాఖల బ్రాంచిలలో రుణమాఫీ గణాంకాలను క్రోడీకరించే పని మొదలు కాలేదు.