మదనపల్లి రూరల్ (చిత్తూరు జిల్లా) : మదనపల్లి పట్టణంలో పి.స్వాతి(25) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబకలహాల కారణంగా భర్త చందుతో గొడవపడి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్రగాయాలపాలైన స్వాతిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.