సీమాంధ్ర బంద్, చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న దీక్షలు | Seemandhra district bandh, protest continues in Chittor district | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర బంద్, చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న దీక్షలు

Published Sun, Aug 18 2013 8:32 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Seemandhra district bandh, protest continues in Chittor district

రాష్ట్ర విభజనకు నిరసనగా చిత్తూరు జిల్లాలో దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుమలలో బస్సులు సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. పాఠశాలలు మూసివేత కొనసాగుతూనే ఉంది. చిత్తూరు జిల్లాలో వివిధ సంఘాలు, వర్గాలు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. 
 
 
సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద జేఏసీ దీక్షలు 18వ రోజుకు చేరుకోగా, కేబుల్‌ ఆపరేటర్ల ఆధ్వర్యంలో 12వ  రోజుకు, రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో 5వ  రోజుకు, విద్యుత్‌ ఉద్యోగులు ఆధ్వర్యంలో 8వ  రోజుకు చేరుకున్నాయి. అంతేకాకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతి సిమ్స్‌, రోయాఆస్పత్రిల వద్ద దీక్షలు 6వ  రోజుకు  చేరుకున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌ పాటించనున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement