'అధికారమనే అమృతం ఇస్తే, విషం కక్కుతున్నారు' | YS Jagan target United Andhra: Tammineni Sitaram | Sakshi
Sakshi News home page

'అధికారమనే అమృతం ఇస్తే, విషం కక్కుతున్నారు'

Published Thu, Dec 5 2013 2:27 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'అధికారమనే అమృతం ఇస్తే, విషం కక్కుతున్నారు' - Sakshi

'అధికారమనే అమృతం ఇస్తే, విషం కక్కుతున్నారు'

హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే వైఎస్ జగన్మోహన రెడ్డి  లక్ష్యం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారామ్ చెప్పారు.  పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో  రాష్ట్రాలు సమైక్యంగా ఉంటేనే పురోగతి సాధించగలమన్నారు. అందుకనే విభజనను అడ్డుకోండని  జగన్ జాతీయ నేతలను కలుస్తున్నారని చెప్పారు. రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు ఆయన తన ప్రయత్నాలు తను చేస్తున్నారని తెలిపారు.

ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నియంతృత్వ ధోరణితో ఏవిధంగానైనా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుందని విమర్శించారు.  ఓట్లు, సీట్ల కోసం వారు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.  అధికారమనే అమృతాన్ని ఇస్తే, వారు విషం కక్కుతున్నారన్నారు. ఏ ప్రయోజనాలు ఆశించి  రాష్ట్రాన్ని  విభజిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement