రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సభ్యుడు ఎంవి మైసూరా రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ డిమాండ్ అన్నారు. తమ పార్టీ ఇచ్చిన లేఖను వక్రీకరిస్తున్నారన్నారని చెప్పారు. రాష్ట్ర విభజనకు తాము ఎప్పుడూ బ్లాంక్ చెక్ ఇవ్వలేదని తెలిపారు. ఎన్నిమార్లు చెప్పినా వారి వాదాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. నిద్ర నటించేవారితో మాట్లాడటం కష్టం అన్నారు. కొన్ని పార్టీలకు మొఖం చెల్లకుండా పోయిందన్నారు. కొన్ని పత్రికలు కూడా విష ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.