సమైక్యాంధ్ర కోసం ఆర్థిక నిపుణుల జేఏసీ
Published Mon, Sep 2 2013 3:46 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ హైదరాబాద్ కేంద్రంగా చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్థిక నిపుణుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటయింది. జూబ్లీహిల్స్‌లోని ఒక హోటల్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్థిక నిపుణులు రాష్ట్ర విభజన జరిగితే వచ్చే అనర్థాలపై విసృ్తతంగా చర్చలు జరిపారు. అభివృద్ధికోసం సమైక్యాంధ్రకే మద్దతు తెలపాలని నిర్ణయించారు. గత నెల రోజులుగా ఏపీ ఎన్జీవోలు, విద్యార్థులు, అడ్వొకేట్లు, జర్నలిస్టులు జేఏసీలుగా ఏర్పడి ఉధృతంగా సాగిస్తున్న ఉద్యమానికి ఈ నిపుణులంతా గట్టి మద్దతు తెలిపారు. విభజన వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక అనర్థాలపై ఒక నివేదికను రూపొందించి త్వరలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు సమర్పించాలని తీర్మానించారు.
ఇదే నివేదికను రాష్ట్రంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటుగా సంబంధిత కమిటీలన్నింటికీ కూ డా సమర్పించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తాత్కాలిక జేఏసీని ఏర్పా టు చేశారు. జేఏసీ చైర్మన్‌గా లంకా దినకర్ (హైదరాబాద్), ఉపాధ్యక్షులుగా జీఎల్‌ఎన్ ప్రసాద్ (గుంటూరు), పి.సుధాకర్ (విజయవాడ), కొండూరు రాజే ష్ (నెల్లూరు), కార్యదర్శులుగా ఎం.ప్రేమ్‌చంద్ (హైదరాబాద్), చల్లం(విశాఖపట్టణం), సంయుక్త కార్యదర్శులుగా ఎం.కళ్యాణ్ (హైదరాబాద్), సీహెచ్ మల్లికార్జునరెడ్డి(ఒంగోలు), చక్కా మహేష్ (గుంటూరు), కేకేవీ ప్రసాద్ (ప.గోదావరి), కార్యవర్గ సభ్యులుగా సోమా వి.సి.రెడ్డి, కుందరవల్లి శ్రావణ్ , వి.వాసురాజు, పి.మోహన్‌రావు, ఎం.విష్ణువర్ధన్, వెంకటరెడ్డిని ఎన్నుకున్నారు.
Advertisement