samaikyandra
-
బంద్ సంపూర్ణం
ఒంగోలు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపార సంస్థలతో పాటు బ్యాంకులు కూడా మూతపడ్డాయి. ప్రైవేటు విద్యా సంస్థలూ బంద్ పాటించాయి. ఏపీఎన్జీవోలు ఆందోళనలకు దిగగా విద్యుత్ ఉద్యోగుల సమైక్యాంధ్ర కార్యాచరణ సమితి నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కందుకూరులో వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్, నియోజకవర్గ సమన్వయకర్త నూకసాని బాలాజీ, మరో సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి అక్కడి నాయకులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మొత్తం పదిమందిని అరెస్టు చేశారు. దర్శిలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాదరెడ్డి దగ్గరుండి బంద్‌ను విజయవంతం చేయించారు. ఒంగోలులో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ తదితరులు బంద్ విజయవంతం చేయించారు. ఉదయం 4.30 గంటలకే ఆర్టీసీ గ్యారేజీ వద్ద బస్సులను అడ్డుకున్నారు. గంటన్నర అనంతరం పోలీసులు 15 మంది నాయకులను అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. మరో వైపు ఏపీఎన్జీవో సంఘ నగర అధ్యక్షుడు నాసర్‌వలి, నాయకులు శరత్, మీరావలి, షరీఫ్, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వీజీకే ప్రసాద్, ఏఈ నాగేశ్వరరావు తదితరులు ప్రకాశం భవనంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులను బంద్‌కు సహకరించాల్సిందిగా కోరుతూ బయటకు రప్పించారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. సీపీవో కాన్ఫరెన్స్ హాలులో జరుగుతున్న ఒంగోలు రెవెన్యూ డివిజన్ సమీక్ష సమావేశాన్ని కూడా నిలిపివేయాల్సిందేనంటూ ఉద్యోగులు సీపీవో కాన్ఫరెన్స్‌హాలు వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉద్యోగుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నాయకలు కూడా అక్కడకు వచ్చి సీఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సమీక్ష సమావేశాన్ని రద్దుచేసి కలెక్టర్ బయటకు వచ్చారు. చీరాలలో నియోజకవర్గ సమన్వయకర్తలు అవ్వారు ముసలయ్య, సజ్జాహేమలతలు అక్కడి నాయకులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గంటపాటు బస్సులను అడ్డుకున్నారు. కనిగిరిలో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మ, తదితర నాయకులు బస్సులను అడ్డుకోవడంతో పాటు పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరిగేటట్లు చర్యలు చేపట్టారు. మార్కాపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జంకే వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. వీరికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పిన్నిక లక్ష్మీప్రసాద్, మరికొందరు సంఘీభావం ప్రకటించి బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిద్దలూరులో నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి, మండల కన్వీనర్లు కలిసి వైఎస్సార్ సెంటర్లో రాస్తారోకో చేశారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరా సామి రంగారెడ్డి, రైతు సంఘం నాయకులు దప్పిలి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. యర్రగొండపాలెంలో నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మద్దిపాడులో సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు ఆందోళనలకు దిగారు. టంగుటూరు, పొన్నలూరు, మర్రిపూడి మండలాల్లోకూడా రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు జరిగాయి. టంగుటూరులో టి.బిల్లుల ప్రతులను మండల కన్వీనర్ బొట్ల రామారావు తదితరులు దహనం చేసి నిరసన తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో సంతమాగులూరు ఆర్టీసీ బస్టాండు వద్ద వైఎస్సార్సీపీ నాయకులు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో.. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ రాయపాటి జగదీశ్ ఒంగోలు దక్షిణ బైపాస్‌లో రాస్తారోకో నిర్వహించారు. సీఎం హెలికాప్టర్‌నే పేల్చివేస్తానంటూ ప్రకటించిన పొన్న ప్రభాకర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ స్థానిక మంగమూరు రోడ్డు జంక్షన్లో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించింది. సమైక్యాంధ్ర కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని జిల్లా చైర్మన్ కట్టా నాగరాజు, కన్వీనర్ ఎస్.వెంకటరావు స్పష్టం చేశారు. -
శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న బంద్
-
ఇంకా సమైక్యాంధ్ర అంటూ పట్టుకుని వేలాడాలా : పురందేశ్వరీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రుల అసలు రంగు ఒక్కొక్కరిది బయటపడుతుంది. ఆ క్రమంలో ఈ సారి కేంద్ర మంత్రి, విశాఖపట్నం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి వంతు వచ్చింది. రాష్ట్ర విభజన అయిపోయింది. అందుకోసం కేంద్రం వడివడిగా దూసుకుపోతుంది. తెలంగాణ బిల్లు తయారైపోతుంది. నేడో రేపో బిల్లుగా రూపాంతరం సంతరించుకుంటుందని పురందేశ్వరి శనివారం విశాఖపట్నం వెల్లడించారు. నగరంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం దూకుడుగా ఉంటే మనం మాత్రం సమైక్యం అంటూ ఉంటే లాభం లేదని ఆయన విశాఖ ప్రజలకు హితవు పలికారు. రాష్ట్ర విభజన వల్ల మనకు రావాల్సిన హక్కులు,ప్యాకేజీలు కోసం పోరాడేలా సమాయత్తం కావాలని విశాఖ నగర ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే సమైక్య కోసం పోరాడాలా లేక ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మన ప్రాంతానికి రావాలసిన హక్కుల కోసం పోరాటం చేయాల అనేది మీరే తెల్చాలని పురందేశ్వరీ విశాఖ ప్రజలకు నిర్ణయాన్ని వదిలేశారు. మీరు ఏలా చెబితే అలా వ్యహరిస్తానని విశాఖ ప్రజలకు పురందేశ్వరీ విన్నవించుకున్నారు. అయితే సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో రాష్ట్ర విభజన వల్ల తనకు తలెత్తిన సమస్యను మీరే తీర్చాలని విశాఖ ప్రజలకు పురందేశ్వరీ మొరపెట్టుకున్నారు. అయితే సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ విభజనతో మిగిలే 13 జిల్లాలను సింగపూర్ చేస్తామన్నారు. ఆమె సొంత నియోజకవర్గమైన బాపట్లను బ్యాగ నగరం తరహాలో అభివృద్ది చేస్తామని ఇటీవల సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు గుంటూరు వచ్చిన ప్పుడు వెల్లడించిన సంగతి తెలిసిందే. సమైక్య కోసం తమ పదవులు సైతం వదులుకుంటామంటూ గతంలోబీష్మ ప్రతిజ్ఞలు చేసిన కేంద్ర మంత్రులు ఊసరవెల్లి తరహాలో తమ అసలు రంగును బయటపెడుతున్నారు. -
టీడీపీ ఎంపీలవి రాజీ‘డ్రామా’లే..
సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేశామని ప్రకటించుకున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుల అసలు రంగు మరోసారి బట్టబయలైంది. టీడీపీ ఎంపీలు సమర్పించిన రాజీనామాలు ఉత్తుత్తి డ్రామానే అని తేలిపోయింది. కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు కూడా డ్రామాలేనన్న అనుమానాలకు బలం చేకూరింది. కొద్ది రోజులుగా రాజీనామాలపై హడావుడి చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలకు ఇప్పుడు ఆ రాజీనామాల ఆమోదం అగ్నిపరీక్షగా మారింది. సీమాంధ్రకు చెందిన లోక్‌సభ సభ్యుల రాజీనామా వ్యవహారంపై సోమవారం మధ్యాహ్నం లోక్‌సభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌తో ఆయా ఎంపీల రాజీనామాల అసలు గుట్టు బయటపడింది. కొందరు ఎంపీలైతే అసలు రాజీనామాలే సమర్పించకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేశారన్న విషయం తేలిపోయింది. సీమాంధ్ర ప్రాంతం నుంచి రాజీనామాలు సమర్పించిన వారుగా.. పది మంది కాంగ్రెస్ (ఎస్.పి.వై.రెడ్డితో కలిపి), ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్, ఒకే ఒక్క టీడీపీ ఎంపీ పేర్లు మాత్రమే స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌లో ఉన్నాయి. వీరిలో సీమాంధ్రకు చెందిన ఏ ఒక్క మంత్రి పేరూ లేదు. అలాగే రాజీనామాలు సమర్పించిన ఎంపీల వైఖరిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల్లో తనను వ్యక్తిగతంగా కలవాలని స్పీకర్ ఆయా ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. ఇలా కలిసినప్పుడు వారు స్పీకర్ ముందు ఏం చెప్తారన్నది చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ ఇచ్చే తీర్పుననుసరించి.. రాజీనామాలపై కాంగ్రెస్ ఎంపీల్లోనూ ఎంతమంది చిత్తశుద్ధితో ఉన్నారు? ఎంతమంది డ్రామాలాడుతున్నారు? అన్న అంశం కూడా కొద్ది రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశముంది. అసలు రాజీనామాలే పంపలేదా..? రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయాలన్న డిమాండ్ అన్ని వైపుల నుంచి బలంగా వినిపించింది. ఈ విషయంలో సీమాంధ్ర కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో అత్యధికులు మొదటి నుంచి హైడ్రామా నడిపిస్తూ వచ్చారు. టీడీపీ లోక్‌సభ సభ్యులు తమ పదవులకు చేసిన రాజీనామాలు బూటకమని అధికారికంగా తేలిపోయింది. సోమవారం లోక్‌సభ సచివాలయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్న 13 మంది ఎంపీల్లో టీడీపీ నుంచి కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం) ఒక్కరి పేరు మాత్రమే ఉండటం దీనికి సాక్ష్యం. జూలై 30న సీడబ్ల్యూసీ సమావేశం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీమాంధ్రలో నూతన రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు నాలుగైదు లక్షల కోట్లు అవసరమవుతాయని తమ పార్టీ నేతలు అంచనా వేశారని, ఆ మొత్తాన్ని కేంద్రం భరించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆగస్టు రెండో తేదీన చంద్రబాబు నివాసంలోనే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి గంట ముందు రాజ్యసభ సభ్యుడు వై.సత్యనారాయణచౌదరి కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజించటాన్ని నిరసిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. రాజ్యసభ సభ్యులు వై.సత్యనారాయణచౌదరి, సి.ఎం.రమేష్‌లతో పాటు లోక్‌సభ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి ఉన్నారు. వీరంద రూ తమ రాజీనామా పత్రాలను ఆ తరువాత పార్టీ అధినేత చంద్రబాబుకు చూపించగా.. వాటిని లోక్‌సభ స్పీకర్‌కు, రాజ్యసభ చైర్మన్‌కు అందచేయాలని సూచించారు. ఆ మేరకు టీడీపీ ఎంపీలంతా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాము రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వారిలో లోక్‌సభ సభ్యులు మోదుగుల, నిమ్మల కిష్టప్ప, ఎన్.శివప్రసాద్‌లు తమ రాజీనామా లేఖలను అసలు స్పీకర్ కార్యాలయానికి గానీ లేదా లోక్‌సభ సచివాలయానికి గానీ పంపలేదు. కొనకళ్ల మాత్రం రాజీనామా పత్రాన్ని స్పీకర్ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. తాజాగా స్పీకర్ కార్యాలయం నుంచి విడుదలైన బులెటిన్‌తో మిగిలిన ఇద్దరు ఎంపీలు రాజీనామా లేఖలే పంపలేదన్న విషయం బయటపడింది. ముందే బయటపెట్టిన హరికృష్ణ టీడీపీ ఎంపీల రాజీనామాలన్నీ ఉత్తుత్తి రాజీనామాలేనని అదే పార్టీకి చెందిన పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మొద ట్లోనే బయటపెట్టారు. ఆగస్టు 5వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగా ఆగస్టు 2వ తేదీనే రాజీనామా చేసినట్టు టీడీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ప్రకటించారు. అయినా పార్లమెంటు సమావేశాలకు హాజరై నానా హడావుడి చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఒక ఎంపీ అయితే విజయ్చౌక్లోని మీడియా పాయింట్ వద్ద చెర్నకోలతో శరీరంపై కొట్టుకున్నారు. రకరకాల వేషాలు ప్రదర్శించారు. ఈ ఎంపీల డ్రామా నడుస్తుండగానే రాజీనామా ఎందుకు ఆమోదం పొందడం లేదో తెలుకోవడానికి స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన హరికృష్ణకు టీడీపీ ఎంపీల రాజీనామాలన్నీ సరిగా లేవని, ఉత్తుత్తి రాజీనామాలని తెలిసి షాకయ్యారు. దాంతో ఆయన వెనువెంటనే మరో రాజీనామా లేఖను అక్కడికక్కడే అందజేసి ఆమోదించాలని స్పీకర్‌ను కోరి మరీ తన రాజీనామాను ఆమోదింపచేసుకున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎన్.శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప తాము రాజీనామా చేశామని చెప్పుకుంటూ ఇంతకాలం హైడ్రామా నడిపారు. దాంతో వీరు సమర్పించిన రాజీనామా సరైనపద్ధతిలో లేవని, అవి ఉత్తుత్తి రాజీనామాలేనని హరికృష్ణ మీడియా ముందు బయటపెట్టారు. అయినప్పటికీ వీరు కిమ్మనకుండా యథావిధిగా తమ డ్రామాను కొనసాగించారు. పార్లమెంటు సమావే శాలు ప్రారంభమైన రోజు నుంచి పూర్తయ్యే వరకు ఢిల్లీలోనే మకాం వేసి ప్రతి రోజూ మీడియా ముందు మాట్లాడుతూ రెండు నెలలుగా హడావుడి చేశారు. తాజాగా స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌తో ఒక్క కొనకళ్ల నారాయణ రాజీనామా పత్రం మినహా మిగిలినవి ఏవీ సభాపతి వద్దకు చేరలేదని, లేదా అసలు అవి స్పీకర్ ఫార్మాట్లో లేవని బయటపడింది. ఇక టీడీపీ రాజ్యసభ సభ్యులదీ అదే దారి. పార్టీ రాజ్యసభ సభ్యులు సుచనాచౌదరి, సి.ఎం.రమేష్‌లు రాజీనామాలను చైర్మన్‌కు పంపించామని ఆర్భాటంగా ప్రకటనలు చేసినా ఇంతవరకు వాటిని ఆమోదించాలని ఏ రోజూ రాజ్యసభ చైర్మన్‌ను కలిసి కోరలేదు. కోరివుంటే హరికృష్ణ రాజీనామా ఆమోదించిన తరహాలోనే వీరి రాజీనామా కూడా ఆమోదం పొందేది. వీరు తమ రాజీనామా ఆమోదానికి ఏమాత్రం సిద్ధంగా లేరని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ కేంద్ర మంత్రుల హైడ్రామా... మరోవైపు కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీల తీరు కూడా ఇలాగే ఉంది. రాజీనామా డిమాండ్ వచ్చినప్పుడు పార్లమెంటులో బిల్లును అడ్డుకుంటామని, సీమాంధ్ర వాణిని వినిపిస్తామని చెప్తూ కొంత కాలం డ్రామా నడిపిన ఎంపీలు ఆ తర్వాత తాము రాజీనామా చేశామని ప్రకటించుకున్నారు. అలాగే మంత్రి పదవులకు రాజీనామా చేసి ఎంపీలుగా కొనసాగుతూ విభజనపై కేంద్రం ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటామని పలువురు సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తూవచ్చారు. అసలు కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ రాకుండా చూస్తామని ప్రక టించారు. కాంగ్రెస్ అధిష్టానం విభజన అంశంపై ఆంటోనీ నేతృత్వంలో కమిటీ నియమిస్తే అది తమ ఒత్తిడి వల్లనేనని చెప్పుకొచ్చారు. ఆంటోనీ కమిటీ సభ్యులు రాష్ట్రంలో పర్యటించి అందరితో చర్చిస్తారని, ఆ కమిటీ నివేదిక ఇవ్వకండా తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు రాదని రకరకాల ప్రకటనలతో గంద రగోళపరిచారు. కానీ వారి మాటలకు జరుగుతున్న పరిణామాలకు పొంతనే లేకుండా పోయింది. కమిటీ రాష్ట్రంలో పర్యటించలేదు సరికదా ఢిల్లీలోనూ రాష్ట్రానికి చెందిన ఏ ముఖ్యమైన వర్గంతోనూ మాట్లాడిన పాపాన పోలేదు. కేవలం మొక్కుబడిగా కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలతో చర్చలకే పరిమితమైంది. ఆ కమిటీ నివేదిక ఇవ్వకుండానే తెలంగాణ నోట్ రూపొందడం, దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా చకచకా జరిగిపోయాయి. ఇవన్నీ కేంద్రమంత్రులకు తెలిసే జరిగినా తమకు ఏమీ తెలియకుండానే జరిగిపోయినట్లుగా మంత్రులు ఒకటి రెండు రోజులు హడావుడి చేశారు. వారివీ ఉత్తుత్తి రాజీనామాలే..! ఇక మరి కొందరు కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేశామని బయటకు చెప్తున్నప్పటికీ అసలు ఆ ప్రయత్నమే చేయలేదు. రాజీనామాలు చేశామని ప్రకటించి ఆ మేరకు స్పీకర్‌కు లేఖలు అందించామని కొందరు చెప్తే.. పార్లమెంటు కార్యాలయంలో సమర్పించామని, ఫ్యాక్స్ ద్వారా పంపించామని మరికొందరు ప్రకటించారు. అయితే ఇవన్నీ ఎంతవరకు నిజమైన రాజీనామాలు, ఎన్ని ఉత్తుత్తి రాజీనామాలు అన్న అంశంపై ప్రతి ఒక్కరిలోనూ అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీలు, సీమాంధ్ర కేంద్రమంత్రులు చేస్తున్న ప్రకటనలకు, కేంద్రం తెలంగాణపై వేస్తున్న అడుగులకు పొంతన లేకపోవటంతో రాజీనామాలపై వారు చేస్తున్న ప్రకటనలు కూడా ఉత్తుత్తివేనన్న అభిప్రాయం ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమకారుల్లో పాతుకుపోయింది. తాజాగా సోమవారం స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌తో ఆ విషయం మరింతగా స్పష్టమవుతోంది. స్వచ్ఛందంగానే చేశామని చెప్తారా..? ఇంతకాలం స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో రాజీనామాలు చేశామంటూ కొందరు ఎంపీలు హడావుడి చేశారు. ఇప్పుడు స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపు రావటంతో.. వారు ఇరకాటంలో పడ్డారు. పలువురు ఎంపీలు దానినుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగతంగా స్పీకర్‌ను కలిసినా రాజీనామాలు ఆమోదం పొందకుండా ఉండేలా స్పష్టత ఇవ్వకుండా ఒత్తిళ్ల మేరకు రాజీనామా చేస్తున్నామన్న వివరణ ఇవ్వాలనే వ్యూహంలో ఎంపీలు ఉన్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. రాజీనామాలు ఇచ్చామని పైకి చెప్పుకోవటానికి వీలుగా రాజీనామాలు తిరస్కారం కాకుండా స్పీకర్ వద్దనే పెండింగ్‌లో ఉండేలా వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. పలువురు ఎంపీలు తమ రాజీనామాలపై స్పష్టత ఇవ్వటానికి స్పీకర్‌ను మరికొంత గడువు కోరాలన్న ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. -
తన బలం తనకు తెలియని చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన బలం ఏమిటో తను తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు తలచుకుంటే రాష్ట్ర విభజన ఆగిపోతుంది. అతని నిర్ణయానికి అంత శక్తి ఉంది. ఆ విషయం ఆయనకు అర్థం కావడంలేదు. రాష్ట్రాన్ని విభజించవద్దని సమైక్యంగా ఉంచమని మొదటి నుంచి సిపిఎం, ఎంఐఎం కోరుతున్నాయి. రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. విభజన విషయం తెలియగానే అందుకు నిరసనగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేశారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో దీక్ష చేశారు.పోలీసులు దానిని భగ్నం చేశారు. ఆ తరువాత జగన్ జైలులో ఉండే నిరవధిక నిరాహారదీక్ష చేశారు. ఆస్పత్రికి తరలించినా ఆయన దీక్ష కొనసాగించారు. అక్కడా ఆయన దీక్షను భగ్నం చేశారు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా పట్టువదలని విక్రమార్కుడులాగా మళ్లీ సమైక్య దీక్ష కోనసాగిస్తున్నారు. సమైక్య రాష్ట్రానికి సిపిఎం, ఎంఐఎం సంపూర్ణ మద్దతు ఇస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉద్యమాన్ని కొనసాగిస్తూ, పోరాటం చేస్తోంది. రాష్ట్ర విభజన ప్రకటించిననాటి నుంచి రాజకీయ పార్టీలతో సంబంధంలేకుండా సీమాంధ్రలో ప్రజలు, ఉద్యోగులు ఉధృతస్థాయిలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మరోపక్క విజయమ్మ తమ పార్టీ ముఖ్యనేతల బృందంతో కలిసి దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతిని మొదలుకొని జాతీయ పార్టీల నేతలను కలుస్తూ సమైక్యాంధ్ర రాష్ట్రానికి మద్దతు కూడగడుతున్నారు. ఈ పరిస్థితులలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి తోడైతే విభజన ఆగిపోవడం ఖాయం. జగన్ పిలుపునకు చంద్రబాబు స్పందిస్తే కాంగ్రెస్ వెనక్కు తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. 'వారు చెబితే మేం వినాలా?' అని ఇటువంటి సందర్భాలలో చంద్రబాబు అనడం సరికాదు. ప్రజల కోసం ఎవరు చెప్పినా తప్పక వినాలి. విని తీరాలి. ప్రజా సంక్షేమం కోసం రాజకీయ పార్టీలు కలిసి ఉద్యమాలు చేయడం, కలసి పోరాటాలు చేయడం కొత్తేమీకాదు. గతంలో వామపక్షాలతో కలిసి అనేక ఉద్యమాలు చేయలేదా? ఒకే లక్ష్యం, అదీ అత్యధిక మంది ప్రజల ఆకాంక్ష మేరకు కలసి ఉద్యమం చేయడంలో తప్పులేదు. అది ఆ పార్టీ ప్రతిష్టనే పెంచుతుంది. మహానటుడు ఎన్‌టి రామారావు తెలుగు జాతి గౌరవం నిలిపేందుకే ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన స్థాపించిన పార్టీ ఈ రోజు ఈ తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి సహకరిస్తుందంటే ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుంది?! ఆయన ఫొటోకు దణ్ణం పెడుతూ ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. తెలుగు జాతిని చీలుస్తున్నందుకు, రాష్ట్రాన్ని రెండు ముక్క్లులు చేస్తున్నందుకు క్షమించమని కోరుతున్నట్లుంది ఆ దృశ్యం. తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు సంస్కృతి పునాదులపై నిర్మించిన పార్టీ నేతలు ఈ విధంగా ప్రవర్తించడాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు ఇలాగే ముందుకు పోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న విషయం ఆయనకు అర్ధం కావడంలేదు. ఇప్పటికైనా చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన లేఖ వెనక్కు తీసుకొని, తన తప్పు సరిదిద్దుకొని, తన శక్తి తెలుసుకొని జగన్ పిలుపు మేరకు ముందుకు వస్తే రాష్ట్రం విడిపోకుండా అడ్డుపడినవాడుగా చరిత్రలో మిగిలిపోతారు. ఆ మహానాయకుడు స్థాపించిన పార్టీ పరువు నిలిపినవాడవుతారు. -
విశ్వరూప్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం
-
విశ్వరూప్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం
మంత్రిపదవికి పినిపే విశ్వరూప్ చేసిన రాజీనామాను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం ఆమోదించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించిన విశ్వరూప్, ఆ మేరకు నేరుగా గవర్నర్ వద్దకు కూడా వెళ్లి రాజీనామా లేఖను ఆయనకే అందించిన విషయం తెలిసిందే. ఆయన విజ్ఞప్తి మేరకు విశ్వరూప్ రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పంపారు. రాష్ట్ర విభజనను ఉప సంహరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేయాలని సెప్టెంబర్ 7 తేదిన భీమవరంలో పినిపే విశ్వరూప్ డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేతల నుంచి రాజీనామాకు ఒత్తిడి పెరగడం, విభజనకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోందనే వార్తల నేపథ్యంలో మంత్రి విశ్వరూప్ రాజీనామా తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
సమైక్యాంధ్ర కోసం ఆర్థిక నిపుణుల జేఏసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ హైదరాబాద్ కేంద్రంగా చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్థిక నిపుణుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటయింది. జూబ్లీహిల్స్‌లోని ఒక హోటల్లో ఆదివారం జరిగిన సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్థిక నిపుణులు రాష్ట్ర విభజన జరిగితే వచ్చే అనర్థాలపై విసృ్తతంగా చర్చలు జరిపారు. అభివృద్ధికోసం సమైక్యాంధ్రకే మద్దతు తెలపాలని నిర్ణయించారు. గత నెల రోజులుగా ఏపీ ఎన్జీవోలు, విద్యార్థులు, అడ్వొకేట్లు, జర్నలిస్టులు జేఏసీలుగా ఏర్పడి ఉధృతంగా సాగిస్తున్న ఉద్యమానికి ఈ నిపుణులంతా గట్టి మద్దతు తెలిపారు. విభజన వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక అనర్థాలపై ఒక నివేదికను రూపొందించి త్వరలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు సమర్పించాలని తీర్మానించారు. ఇదే నివేదికను రాష్ట్రంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటుగా సంబంధిత కమిటీలన్నింటికీ కూ డా సమర్పించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తాత్కాలిక జేఏసీని ఏర్పా టు చేశారు. జేఏసీ చైర్మన్‌గా లంకా దినకర్ (హైదరాబాద్), ఉపాధ్యక్షులుగా జీఎల్ఎన్ ప్రసాద్ (గుంటూరు), పి.సుధాకర్ (విజయవాడ), కొండూరు రాజే ష్ (నెల్లూరు), కార్యదర్శులుగా ఎం.ప్రేమ్‌చంద్ (హైదరాబాద్), చల్లం(విశాఖపట్టణం), సంయుక్త కార్యదర్శులుగా ఎం.కళ్యాణ్ (హైదరాబాద్), సీహెచ్ మల్లికార్జునరెడ్డి(ఒంగోలు), చక్కా మహేష్ (గుంటూరు), కేకేవీ ప్రసాద్ (ప.గోదావరి), కార్యవర్గ సభ్యులుగా సోమా వి.సి.రెడ్డి, కుందరవల్లి శ్రావణ్ , వి.వాసురాజు, పి.మోహన్‌రావు, ఎం.విష్ణువర్ధన్, వెంకటరెడ్డిని ఎన్నుకున్నారు. -
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ ఎవరికీ వ్యతిరేకం కాదు: ఏపీఎన్జీవోల సంఘం
‘సేవ్ ఆంధ్రప్రదేశ్ అవగాహనా సదస్సు’ పేరిట ఈనెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన సమైక్యాంధ్ర ఉద్యోగుల సభ ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరినీ కించపరచడానికి కూడా కాదని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌బాబు, చంద్రశేఖరరెడ్డి స్పష్టంచేశారు. ఆదివారమిక్కడి ఏపీఎన్జీవో కార్యాలయంలో సభ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఉద్యోగుల సభను అడ్డుకుంటామంటున్నవారికి ఒకటే చెబుతున్నాం. మా సభ ఎవరికీ వ్యతిరేకం కాదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని, విభజన వల్ల జరిగే నష్టాలు, ఎదురయ్యే ఇబ్బందులను వివరించడానికే దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. సభ పెట్టొద్దనే హక్కు ఎవరికీ లేదు. మా సభ విజయవంతం అయితే మీ(విభజన) వాదనకు బలం లేనట్లే’’ అని పేర్కొన్నారు. విభజనకు ముందే పరిస్థితి ఇలా ఉంటే, విభజన తర్వాత పరిస్థితులు ఎలా మారతాయనే అంశంపై కేంద్రాన్ని నిలదీస్తామని వెల్లడించారు. రాజకీయ నాయకులు ఎవరైనా తమ సభకు రావచ్చని, అయితే పార్టీల జెండా, ఎజెండాలను పక్కనబెట్టి వస్తేనే ఆహ్వానిస్తామని స్పష్టంచేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నిలుస్తున్న నాయకులు ఎవరైనా సభకు ఆహ్వానితులేనని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాంతం వారైనా సభకు రావొచ్చన్నారు. సభ నిర్వహణకు ఇప్పటి వరకు అనుమతి రాలేదని, తాము 15 రోజుల క్రితమే అనుమతి కోసం విజ్ఞప్తి చేశామని చెప్పారు. సోమవారంలోగా అనుమతి రాకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. సభ నిర్వహణకు అనుమతి వస్తే స్టేడియంలో నిర్వహిస్తామని, లేకుంటే రోడ్డుపైనే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సభ నిర్వహణ ఖర్చుల కోసం ఉద్యోగుల నుంచి చందాలు వసూలు చేస్తున్నామని, ఇందుకోసం ఒక్కొక్కటి రూ. 10 విలువైన 1.5 లక్షల కూపన్స్ ప్రింట్ చేయించామని వివరించారు. ఇంకా డబ్బు అవసరమైతే ఏపీఎన్జీవో సంఘం నుంచి ఖర్చు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్రకు చెందినవారు దాదాపు 40 లక్షల మంది ఉన్నారని, అందువల్ల పెద్ద సంఖ్యలో జనం సభకు వస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. ఆర్టీసీని, విద్యాసంస్థల్ని సమ్మె నుంచి మినహాయించాలంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చేస్తున్న డిమాండ్ సమంజసమేనని వారు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యమ సమన్వయానికి జేఏసీ: సమాజంలోని అన్ని వర్గాలను సమన్వయపరుస్తూ సమైక్య రాష్ట్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి వీలుగా రాష్ట్రస్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) కార్యవర్గాన్ని సోమవారం ఏర్పాటు చేయనున్నారు. ఏపీ ఎన్జీవోలు నేతృత్వం వహించే ఈ కమిటీలో ఉద్యోగులతోపాటు న్యాయవాదులు, డాక్టర్లు, విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు.. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ఈనెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న అవగాహన సదస్సుకు హైదరాబాద్‌లోని సమైక్యవాదులు ఇంటికొకరు చొప్పున తరలి రావాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమైక్య వాదాన్ని బలపరిచే కళాకారులు, గాయకులు కూడా ఈ సభకు హాజరుకావాలని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కోరారు. సభలో కళాకారులు, గాయకులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఏపీఎన్జీవోల నగర అధ్యక్షుడు సత్యనారాయణ, విద్యుత్‌సౌధ ఉద్యోగుల జేఏసీ నేత నాగప్రసాద్, సమైక్య న్యాయవాదుల జేఏసీ ప్రతినిధి వి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ వద్ద ఆమరణ దీక్షకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల యోచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సెప్టెంబర్ 3 తేది నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో ఆమరణ దీక్ష చేపట్టాలని యోచిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ తో సీమాంధ్రకు చెందిన శాసనసభ్యులు పాల్గొంటారని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 7 తేదిన ఏపీఎన్జీఓలు బహిరంగసభకు ప్రయత్నాలు చేపట్టడం, సీమాంధ్ర నేతలు దీక్షకు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికి వరకు జిల్లాలకే పరిమితమైన ఉద్యమాన్ని హైదరాబాద్ కు చేర్చే ప్రణాళికను రచిస్తున్నారు. సీమాంధ్ర జిల్లాలో ఆందోళనలు చేపట్టి శుక్రవారానికి 31వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ ఇచ్చిన లేఖలను వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ, సీపీఐ పార్టీలను శైలజానాధ్ డిమాండ్ చేశారు. -
సమైక్య ఉద్యమ కార్యచరణ
కడప రూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ కార్యచరణలో భాగంగా శనివారం ఉదయం కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ప్రజాప్రతినిధులతో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. 12వ తే దీన జిల్లాలోని అన్ని కేంద్ర కార్యాలయాల దిగ్బంధనం, 13వ తేదీన అన్ని మండలాల్లో సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం, 14వ తేదీన సాయంత్రం 7నుంచి 7.30గంటల వరకు విద్యుత్ దీపాలను ఆపి నిరసన, 18వ తేదీన కడప, రాజంపేట, ఎర్రగుంట్లలో ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు రైల్‌రోకో కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. రైల్‌రోకో కార్యక్రమాల్లో భాగంగా వంటావార్పు ఉంటుందన్నారు. సమైక్యవాదులు ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
కేసిఆర్ వల్లే ఇరుప్రాంతాల్లో అభద్రతాభావం : ఉండవల్లి
-
ఉద్యమంపై సర్కార్ ఆరా!
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :‘అనంత’లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రాష్ర్ట ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. జూలై 30న రాష్ర్ట విభజనకు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. అదే నెల 31న నగరంలో విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలు పంపాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అప్పటి నుంచి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పాలనకు సంబంధించి జిల్లా అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. డివిజన్ల వారీగా ఎంత మంది ఉద్యోగులు విధులకు హాజరయ్యారు? మండల, తహశీల్దార్ కార్యాలయాల్లో ఎంత మంది హాజరయ్యారు? కార్యాలయాల్లో విధ్వంసకర సంఘటనలు ఏమైనా చోటు చేసుకుంటున్నాయా? తదితర వివరాలను ఆరా తీస్తోంది. పాలన వ్యవహారాలకు సంబంధించి ఆయా డివిజన్లలో ఆర్డీఓల ద్వారా కలెక్టరేట్ అధికారులు నివేదికలు తెప్పించుకుని ప్రభుత్వానికి పంపుతున్నారు. రెవెన్యూ పాలనకు సంబంధించిన వివరాలను మాత్రమే తాము ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. స్తంభించిన పాలన జిల్లాలో గత 9 రోజులుగా పాలన స్తంభించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ మూతపడ్డాయి. అనంతరం నాలుగో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని చోట్ల మాత్రమే తెరచుకున్నాయి. కార్యాలయాలు తెరచుకున్నా ఉద్యోగులు 72 గంటల పాటు విధులు బహిష్కరించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 25వేల మంది ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నట్లు ప్రభుత్వానికి నివేదించారు. గురువారం కూడా అరకొరగానే ప్రభుత్వ కార్యాలయాలు తెరచుకున్నాయి. నగరంలో ఎస్బీఐ ప్రధాన కార్యాలయం బ్యాంకు మినహా మరే బ్యాంకు తలుపులూ తెరుచుకోలేదు. వీటితో పాటు పలు ప్రైవేట్ బ్యాంకులు, సంస్థలు కూడా నేటికీ ప్రారంభం కాలేదు. చనిపోయిన వారి వివరాల సేకరణలో వైఫల్యం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున పిట్టల్లా రాలుతున్నారు. దాదాపు 20 మంది పైబడి సమైక్యాంధ్ర కోసం చనిపోయారు. అయితే ఇప్పటిదాకా ఒకరు మాత్రమే సమైక్యాంధ్ర కోసం చనిపోయారని నివేదిక అందినట్లు ఆ విభాగం పర్యవేక్షిస్తున్న ఓ అధికారిణి పేర్కొన్నారు. -
తెలంగాణాలోను సమైక్యవాదులు ఉన్నారు
-
శాసన సభ్యత్వానికి బాలినేని రాజీనామా
-
రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకున్నా: బొత్స