
ఇంకా సమైక్యాంధ్ర అంటూ పట్టుకుని వేలాడాలా : పురందేశ్వరీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రుల అసలు రంగు ఒక్కొక్కరిది బయటపడుతుంది. ఆ క్రమంలో ఈ సారి కేంద్ర మంత్రి, విశాఖపట్నం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి వంతు వచ్చింది. రాష్ట్ర విభజన అయిపోయింది. అందుకోసం కేంద్రం వడివడిగా దూసుకుపోతుంది. తెలంగాణ బిల్లు తయారైపోతుంది. నేడో రేపో బిల్లుగా రూపాంతరం సంతరించుకుంటుందని పురందేశ్వరి శనివారం విశాఖపట్నం వెల్లడించారు. నగరంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం దూకుడుగా ఉంటే మనం మాత్రం సమైక్యం అంటూ ఉంటే లాభం లేదని ఆయన విశాఖ ప్రజలకు హితవు పలికారు.
రాష్ట్ర విభజన వల్ల మనకు రావాల్సిన హక్కులు,ప్యాకేజీలు కోసం పోరాడేలా సమాయత్తం కావాలని విశాఖ నగర ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే సమైక్య కోసం పోరాడాలా లేక ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మన ప్రాంతానికి రావాలసిన హక్కుల కోసం పోరాటం చేయాల అనేది మీరే తెల్చాలని పురందేశ్వరీ విశాఖ ప్రజలకు నిర్ణయాన్ని వదిలేశారు. మీరు ఏలా చెబితే అలా వ్యహరిస్తానని విశాఖ ప్రజలకు పురందేశ్వరీ విన్నవించుకున్నారు. అయితే సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో రాష్ట్ర విభజన వల్ల తనకు తలెత్తిన సమస్యను మీరే తీర్చాలని విశాఖ ప్రజలకు పురందేశ్వరీ మొరపెట్టుకున్నారు.
అయితే సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ విభజనతో మిగిలే 13 జిల్లాలను సింగపూర్ చేస్తామన్నారు. ఆమె సొంత నియోజకవర్గమైన బాపట్లను బ్యాగ నగరం తరహాలో అభివృద్ది చేస్తామని ఇటీవల సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు గుంటూరు వచ్చిన ప్పుడు వెల్లడించిన సంగతి తెలిసిందే. సమైక్య కోసం తమ పదవులు సైతం వదులుకుంటామంటూ గతంలోబీష్మ ప్రతిజ్ఞలు చేసిన కేంద్ర మంత్రులు ఊసరవెల్లి తరహాలో తమ అసలు రంగును బయటపెడుతున్నారు.