హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వెళితే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేవని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపారు. గురువారం ఏపీ ఉద్యోగులు పురందేశ్వరిని కలిశారు.తాత్కాలిక రాజధానికి తరలించవద్దని ఈ సందర్భంగా ఉద్యోగులు ఆమెను కోరారు. తమ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులతో భేటీ అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్ గురించి ఉద్యోగులు ఆవేదన పడుతున్నారన్నారు. ఏపీ అగ్రగామిగా ఉండాలంటే ఉద్యోగులు కలిసి పనిచేయాలన్నారు.