అసెంబ్లీ వద్ద ఆమరణ దీక్షకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల యోచన
Published Fri, Aug 30 2013 7:53 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సెప్టెంబర్ 3 తేది నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో ఆమరణ దీక్ష చేపట్టాలని యోచిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ తో సీమాంధ్రకు చెందిన శాసనసభ్యులు పాల్గొంటారని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాథ్ వెల్లడించారు.
సెప్టెంబర్ 7 తేదిన ఏపీఎన్జీఓలు బహిరంగసభకు ప్రయత్నాలు చేపట్టడం, సీమాంధ్ర నేతలు దీక్షకు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికి వరకు జిల్లాలకే పరిమితమైన ఉద్యమాన్ని హైదరాబాద్ కు చేర్చే ప్రణాళికను రచిస్తున్నారు. సీమాంధ్ర జిల్లాలో ఆందోళనలు చేపట్టి శుక్రవారానికి 31వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ ఇచ్చిన లేఖలను వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ, సీపీఐ పార్టీలను శైలజానాధ్ డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement