కడప రూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ కార్యచరణలో భాగంగా శనివారం ఉదయం కడప నగరంలోని వైఎస్‌ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ప్రజాప్రతినిధులతో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. 12వ తే దీన జిల్లాలోని అన్ని కేంద్ర కార్యాలయాల దిగ్బంధనం, 13వ తేదీన అన్ని మండలాల్లో సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం, 14వ తేదీన సాయంత్రం 7నుంచి 7.30గంటల వరకు విద్యుత్ దీపాలను ఆపి నిరసన, 18వ తేదీన కడప, రాజంపేట, ఎర్రగుంట్లలో ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు రైల్‌రోకో కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. రైల్‌రోకో కార్యక్రమాల్లో భాగంగా వంటావార్పు ఉంటుందన్నారు. సమైక్యవాదులు ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.