రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేం దుకు దివంగత ముఖ్యమంతి ఎన్టీఆర్ తీవ్రంగా కృషి చేశారని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. మంగళవారం స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకున్న వారు పార్టీలకతీతంగా అభినందనీయులేనన్నారు. రాష్ట్రం ముక్కలు కాకుండా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చుతోందని విమర్శించారు.
సమైక్యాంధ్రకు కట్టుబడే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారన్నారు. నేతల విగ్రహాలకు తమ పార్టీ క్షీరాభిషేకం చేస్తుందని, నష్టపరిచే ఉద్దేశం ఉండదన్నారు. కొన్ని స్వార్థశక్తులు చేసిన పనిని తమ పార్టీ కార్యకర్తలపై నెట్టివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కోటగుమ్మం సెంటర్‌లో 48 గంటల నిరాహార దీక్ష చేపట్టిన వారికి సంఘీభావం ప్రకటించారు. పార్టీ నాయకుడు కర్రి సతీష్ వీఎల్ పురం సెంటర్‌లో చేపట్టిన 72 గంటల నిరసన దీక్షకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్లు అజ్జరపు వాసు, బొమ్మనమైన శ్రీనివాస్, నాయకులు కె.జోగారావు, బుడ్డిగ రవి, కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం
Published Wed, Aug 7 2013 2:52 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement
Advertisement