పోటెత్తిన జన ప్రవాహం | huge crowd participated in united andhra movement | Sakshi
Sakshi News home page

పోటెత్తిన జన ప్రవాహం

Published Fri, Aug 9 2013 6:18 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

huge crowd participated in united andhra movement

కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతూనే ఉంది.  గురువారం కూడా వేలాది మంది ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకోవడంతో ఆ ప్రాంతం జన ప్రవాహంగా మారింది. దీంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, ఉద్యమ గేయాలు, నినాదాలు, నాయకుల ఉపన్యాసాలతో కోలాహలంగా మారింది. రెవెన్యూ ఉద్యోగులు నగరంలోని కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్,ఏడురోడ్ల కూడలి మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. గ్రామ నౌకర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లు ఈ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో కలెక్టరేట్ బోసిపోయింది. సర్వే అండ్ ల్యాండ్‌రికార్డ్స్ ఏడీ కార్యాలయ సిబ్బంది, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు అక్కడే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.


12నుంచి సమ్మెలోకి
రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేదనాయకం ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాలాంధ్ర వల్ల రాయలసీమ ప్రజలు కర్నూలు రాజధానిని కోల్పోయారని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్‌ను అన్ని ప్రాంతాల వారు కలిసి సమగ్రంగా అభివృద్ధి చేశారని చెప్పారు. రాష్ట్రాన్ని పాలించిన సీమకు చెందిన ముఖ్యమంత్రులెవరూ తెలంగాణా పట్ల వివక్ష చూపలేదన్నారు. కానీ అక్కడ వేర్పాటువాద ఉద్యమం తలెత్తడం విచారకరమన్నారు. సాగునీరు, విద్యుత్, ఉద్యోగాలు వంటి అంశాల్లో ఎలాంటి విధి విధానాలు రూపొందించకుండానే రాజకీయ దురుద్దేశ్యంతో రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విభజన జరిగితే ఉద్యోగులు సీనియారిటీ కోల్పోవాల్సి ఉంటుందన్నారు. ఈనెల 11వ తేదిలోపు ప్రజాప్రతినిధులు రాజీనామా చేయకపోతే 12వ తేది నుంచి తాము సమ్మెలోకి వెళతామని ప్రకటించారు.


మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలి
ఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కెవి శివారెడ్డి మాట్లాడుతూ మంత్రులు, ఎంపీలు తక్షణం రాజీనామాలు సమర్పించి రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం దిగి రాదన్నారు. ఈనెల 12వ తేది అర్ధరాత్రి నుంచి తాము సమ్మెలోకి వెళుతున్నామని చెప్పారు. టీడీపీ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ విభజన జరిగితే ఉద్యోగుల పదోన్నతులు ఆగి పోతాయన్నారు. కేంద్ర,రాష్ట్ర మంత్రులు రాజీనామాలు చేస్తే తప్ప సోనియా దిగిరాదన్నారు. ఆగస్టు 15వ తేదిన బ్లాక్ డేగా పాటించాలని పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ కమిటీకే చట్టబద్ధత లేకపోతే ఆంటోనీ కమిటీ వల్ల ఏమి ఒనగూరుతుందని ఆయన ప్రశ్నించారు.


వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు అంజద్‌బాషా మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం కేంద్రంలోని కాంగ్రెస్ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించడం బాధాకరమన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పా టు చేయాలని సీమాంధ్ర మంత్రుల నుంచే ప్రతిపాదన రావడం విచారకరమన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సం ఘం మాజీ అధ్యక్షుడు ఖాదర్‌బాష, ఎన్‌జిఓ సంఘం మాజీ అధ్యక్షుడు యల్లారెడ్డి, సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగభూషణ్‌రెడ్డి ప్రసంగించారు.


నాలుగవరోజుకు చేరిన దీక్షలు
సమైక్యాంధ్ర పరిరక్షణ ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే దీక్షలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ఉపాధ్యాయులు నోటికి నల్ల పట్టి ధరించి దీక్షల్లో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని ఉపాధ్యాయ నాయకులు పి.సుదర్శన్‌రెడ్డి, వై.తిరుపాల్, నరసారెడ్డి, వెంకటసుబ్బయ్య తదితరులు గణాంకాలతో సహా వివరించారు. శుక్రవారం కూడా తమ నిరాహారదీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ జిల్లా కన్వీనర్ జివి నారాయణరెడ్డి, ఎంఈఓల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగమునిరెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామిరెడ్డిలు ప్రసంగించారు. రిలే దీక్షల్లో ఉపాధ్యాయ నాయకులు నీలవేణి, మాధవి, శ్రీదేవి, అర్పిత, శైలజ, విజయలక్ష్మి, జె.శ్రీనివాసులు, పివి సుబ్రమణ్యం, విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.

 సమైక్యాంధ్ర పరిరక్షణ ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే దీక్షలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ఉపాధ్యాయులు నోటికి నల్ల పట్టి ధరించి దీక్షల్లో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని ఉపాధ్యాయ నాయకులు పి.సుదర్శన్‌రెడ్డి, వై.తిరుపాల్, నరసారెడ్డి, వెంకటసుబ్బయ్య తదితరులు గణాంకాలతో సహా వివరించారు. శుక్రవారం కూడా తమ నిరాహారదీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ జిల్లా కన్వీనర్ జివి నారాయణరెడ్డి, ఎంఈఓల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగమునిరెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామిరెడ్డిలు ప్రసంగించారు. రిలే దీక్షల్లో ఉపాధ్యాయ నాయకులు నీలవేణి, మాధవి, శ్రీదేవి, అర్పిత, శైలజ, విజయలక్ష్మి, జె.శ్రీనివాసులు, పివి సుబ్రమణ్యం, విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.


నిత్యానందరెడ్డికి పలువురి సంఘీభావం
సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు బండి నిత్యానందరెడ్డికి గురువారం పలువరు సంఘీభావం వ్యక్తంచేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు అంజద్‌బాష, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, పులి సునీల్‌కుమార్, షఫి, కెఎన్ సమరనాధరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, పులివెందుల టీడీపీ నాయకులు రాంభూపాల్‌రెడ్డి, వేంపల్లె సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజోలు వీరారెడ్డి, షంషీర్, షాషావలీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కుమార్‌రెడ్డి తదితరులు మద్దతు ప్రకటించారు.


విద్యార్థుల రిలే దీక్షలు  
శ్రీసాయి కాలేజ్ ఆఫ్ ఐటి అండ్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రదర్శనగా చేరుకొని కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం రాజకీయ కారణాల వల్లె సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ఒడిగట్టిందని ఆరోపించారు.


పలువురి ప్రదర్శనలు
గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యజమానులు, మదర్ ఇండియా ఇంగ్లీష్ మీడియం స్కూల్, గురుకుల్ విద్యాపీఠ్, వేంపల్లె ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల జేఏసీ, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, వ్యవసాయ శాఖ ఉద్యోగులు, పురుగు మందులు, విత్తనాలు, ఎరువుల డీలర్ల అసోసియేషన్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, శ్రీహరి డిగ్రీ కళాశాల విద్యార్థులు, దారాల ఉక్కాయపల్లె ప్రజలు ప్రదర్శనగా వచ్చారు.  బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కర్రసాము, విచిత్ర వేషధారణలతో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. భవిష్యత్తులో సమైక్యాంధ్ర ఉద్యమకారులపై పోలీసు కేసులు బనాయిస్తే తాము ఉచితంగా వాదిస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement