సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమైక్య ర్యాలీ | Seemandhra Employees conducts samaikya rally for United andhra during on AP Formation day | Sakshi
Sakshi News home page

సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమైక్య ర్యాలీ

Published Sat, Nov 2 2013 5:14 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

Seemandhra Employees conducts samaikya rally for United andhra during on AP Formation day

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో సమైక్య ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎల్ బ్లాక్ నుంచి ఉద్యోగులంతా తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు మురళీకృష్ణ, వైస్ చైర్మన్ బెన్సన్, కో చైర్మన్ మురళీమోహన్, కన్వీనర్ వెంకటసుబ్బయ్య, కోఆర్డినేటర్ రవీందర్‌రావు, సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, సచివాలయ సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, మహిళా ఉద్యోగుల సంఘం ప్రతినిధి నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement