హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటనతో సుమారు 67రోజులు పాటు ఉద్యమ బాట పట్టిన సీమాంధ్ర ఉద్యోగులు.... రెండు నెలల అనంతరం శుక్రవారం విధులకు హాజరయ్యారు. దాంతో ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగులతో కళకళలాడుతున్నాయి. రాష్ర్టవిభజన వ్యతిరేకిస్తూ ఎపి ఎన్జీవో ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ విధులు బహిష్కరించి సుమారు 60 రోజులకు పైగా తమ నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
విద్యార్దుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయ సంఘాలు తాత్కలికంగా సమ్మె విరమించి విధులకు హజరయ్యారు.తాత్కలికంగా తమ సమ్మెను వాయిదా వేసిన కేంద్రప్రభుత్వం నుండి సమైక్యాంద్రాకు మద్దతుగా ప్రకటన రాకపోతే మరలా సమ్మెలోకి దిగి ఉద్యమాని మరింత ఉద్రిక్తత చేస్తామని హెచ్చరించారు.