తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పార్టీ కాపాడలేకపోయింది అని ఆ పార్టీకి సీనియర్ నేత తమ్మినేని సీతారాం రాజీనామా సమర్పించారు. రాజీనామాతోపాటు పార్టీ అధినేత చంద్రబాబుకు 10 పేజిల బహిరంగ లేఖను తమ్మినేని రాశారు. ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్దంగా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది అంటూ లేఖలో ఘాటైన విమర్శలు చేశారు. ఎన్టీఆర్ సిద్దాంతాలను, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోయినందునందునే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని మీడియా సమావేశంలో ప్రకటించారు. బలహీన ప్రభుత్వం, ప్రతిపక్షం ఉన్నందునే రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది అని తమ్మినేని అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. తమ్మినేని సీతారాం రాజీనామాతో తెలుగుదేశానికి ఉత్తరాంధ్రలో మరో గట్టి షాక్ తగిలింది.
Published Sun, Aug 25 2013 3:54 PM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement