కుప్పం రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో రాష్ట్రం అథోగతి పాలవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, జెడ్పీ మాజీ చైర్మన్ ఎం.సుబ్రమణ్యంరెడ్డి పేర్కొన్నారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి, లేకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా కుప్పంలో ఆమరణ దీక్ష చేస్తున్న వారిని ఆయన గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు తల్లిని విడదీసే అధికారం సోనియూకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికే సీమాంధ్రప్రజలు సాగు, తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారని, రాష్ట్రాన్ని విభజిస్తే తీరని నష్టం కలుగుతుందని అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనన్నారు.
కుప్పంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కన్నన్, వసనాడు సర్పంచ్ మురళీధరన్, సేవాదళ్ జిల్లా కన్వీనర్ కదిరవేలు, సామగుట్టపల్లెకు చెందిన పార్టీ కార్యకర్త మణికంఠ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురువారం నాలుగో రోజుకు చేరింది. వీరికి మద్దతుగా పార్టీ మండల కన్వీనర్ సోమమూర్తి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సెంథిల్‌కుమార్, డీకేపల్లె సర్పంచ్ శోభామణి, వానగుట్టపల్లె సర్పంచ్ లక్ష్మీకాంతయ్య, పార్టీ నాయకులు రాంకుమార్, మంజు, ఆర్ముగం, శ్రీనివాసులు, క్రిష్టియన్ పాస్టర్లు, బెస్త కులస్తులు, సుమో యూనియన్ సభ్యులు దీక్షలో పాల్గొన్నారు.
విభజనతో రాష్ట్రం అథోగతే!
Published Fri, Aug 23 2013 4:52 AM | Last Updated on Mon, Jan 7 2019 8:29 PM
Advertisement
Advertisement