వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ హరికృష్ణ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ప్రారంభించిన ఆమరణ దీక్షను పోలీసులు శనివారం భగ్నం చేశారు. వైఎస్ విజయమ్మ సమర దీక్షకు మద్దతుగా ఆరు రోజులుగా ఆమరణ దీక్ష చేయడం వల్ల హరికృష్ణ ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు.
పుట్టపర్తి టౌన్, న్యూస్‌లైన్ : వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ హరికృష్ణ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ప్రారంభించిన ఆమరణ దీక్షను పోలీసులు శనివారం భగ్నం చేశారు. వైఎస్ విజయమ్మ సమర దీక్షకు మద్దతుగా ఆరు రోజులుగా ఆమరణ దీక్ష చేయడం వల్ల హరికృష్ణ ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. దీక్ష విరమించాలని కోరారు. ప్రాణాలు కోల్పోయినా పర్వాలేద ని, దీక్ష కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. దీంతో సీఐ శ్రీధర్ మధ్యాహ్నం 12 గంటలకు పోలీసు సిబ్బందితో వచ్చి ఆయన్ను బలవంతంగా కొత్తచెరువు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తానని ఆయన మొండికేయడంతో కడపల మోహన్‌రెడ్డి సహా పలువురు ఆయనకు నచ్చజెప్పారు. ఎట్టకేలకు జిల్లా ప్రచార కార్యదర్శి కొత్తకోట సోమశేఖరరెడ్డి దీక్ష విరమింపజేశారు.