వరదయ్యుపాళెం, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయలేనపుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గుంటూరులో ఆవురణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందని స్వాతంత్య్ర సవురయోధులు, గాంధేయవాది చెరుకుమూడి శ్రీవాత్సవ నియోగి అన్నారు.
బుధవారం బత్తలవల్లం గ్రావుంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉజ్వల్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, గిరిరెడ్డి చేపట్టిన రిలే నిరాహార దీక్షను నియోగి ప్రారంభించి వూట్లాడారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం విజయువ్ము దీక్ష చేస్తుండడం అభినందనీయువుని కొనియాడారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే విడుదలై సత్యవేడు ప్రాంతంలో పర్యటించాలని అభిలషించారు. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ సవుర్థనీయుం కాదన్నారు. తెలుగు వూట్లాడే వారందరూ ఒకే రాష్ట్రంగా ఉండాలని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టాలని డివూండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదివుూలం, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయుత్రీదేవి, నాయకులు బీరేంద్రవర్మ, కేశవులు, జెడ్పీటీసీ వూజీ సభ్యుడు వెంకటకృష్ణయ్యు, పార్టీ వుం డల కన్వీనర్లు సుబ్రవుణ్యంరెడ్డి, నిరంజన్‌రెడ్డి, బందిల సురేష్, రాచర్ల భూష ణం పాల్గొన్నారు.
విజయమ్మ రక్షణ బాధ్యత ప్రభుత్వాలదే
Published Thu, Aug 22 2013 3:59 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
Advertisement
Advertisement