తెలుగోళ్లమంటూ మోసం చేసిన్రు: నాయిని నర్సింహారెడ్డి | Seemandhra cheats to make for united andhra, Naini Narasimha reddy | Sakshi
Sakshi News home page

తెలుగోళ్లమంటూ మోసం చేసిన్రు: నాయిని నర్సింహారెడ్డి

Published Mon, Nov 25 2013 6:43 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

Seemandhra cheats to make for united andhra, Naini Narasimha reddy

కమ్మర్‌పల్లి, న్యూస్‌లైన్ :  తెలుగు మాట్లాడే వా ళ్లంతా ఒక్కటిగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసి సీమాంధ్రులు మోసానికి పాల్పడ్డారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యు డు నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు. మం డల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ చెప్రాసీ కొలువు ఇవ్వలేదని మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర వేరుకావాలని పొట్టి శ్రీరాములుతో ఆమరణ నిరాహార దీక్ష చేయించారన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ మీద కన్నేసి తెలంగాణను విలీనం చేసుకొని మోసాలకు తెరలేపారన్నారు. సమైక్యాంధ్రలో అన్ని రకాలుగా నష్టపోయామని, అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్‌గా తీర్చిద్దిదడానికి టీఆర్‌ఎస్ ప్రణాళిక రూపొందించిందని పేర్కొన్నారు.
 
 72 లక్షల ఎకరాలకు సాగునీరు
 ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 72 నియోజకవర్గాల్లో 72 లక్ష ఎకరాలకు సాగునీరందించడానికి ప్రాజెక్టులు చేపట్టే ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు. విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి విద్యుత్ కొరత లేకుండా చేస్తామన్నారు. టీఆర్‌ఎస్ పాలన లేకుంటే తెలంగాణ పరిస్థితి అధోగతి అవుతుందన్నారు. తెలంగాణ అంశం మరుగున పడకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు కేసీఆర్ ప్రజలను చైతన్యపరిచారని ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కడితే తెలంగాణ ఏర్పాడ్డాక మండల కేంద్రాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు, జిల్లాలో నిమ్స్ తరహా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి కరిమెల్ల బాబూరావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ భాస్కర్ యాదవ్, నాయకులు కొండ ప్రకాశ్‌గౌడ్, చిన్నారెడ్డి, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
 
 సంపూర్ణ తెలంగాణే లక్ష్యం
 ధర్పల్లి : పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ రాష్ట్ర సాధనే టీఆర్‌ఎస్ లక్ష్యమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రమణాచారి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని షాదీఖానా హాల్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తల శిక్షణ శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆధ్వర్యంలో సాగిన ఉద్యమం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. తెలంగాణ ప్రకటనకే కాంగ్రెస్ నేతలు జైత్రయాత్రలు నిర్వహించటం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం అయ్యేలా నేతలు చూడాలన్నారు.
 
 టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుది తెలంగాణపై కుక్క తోక వంటి ప్రవర్తన అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మండవకు చీమూనెత్తురు లేదన్నారు. ఇప్పటికీ చంద్రబాబు వద్దే ఉన్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రూరల్ ఇన్‌చార్జి భూపతిరెడ్డి, నాయకులు కిశోర్, విఠల్‌రెడ్డి, సుజావుద్దీన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement