
'ఎప్పటికీ ప్రజల హృదయాల్లో ఉంటారు'
ఇడుపులపాయ: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబీకులు శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తనయుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ‘‘కొందరు వ్యక్తులు మనల్ని వదిలి వెళ్లిపోయినా.. ఎప్పటికీ మన హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతారు. మా నాన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనను మనసారా తలచుకుంటున్నాం. ఆయన లేని లోటు తీర్చలేనిది’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. తన తండ్రితో గల అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
మహానేత జయంతి సందర్భంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.
Some people live forever in the hearts of all those they leave behind. Fondly remembering and missing my father, on his birthday.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 8 July 2016