చాలా మిస్‌ అవుతున్నానమ్మా.. సోనూసూద్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ | Sonu Sood Shares Emotional Post For His Mother Birth Anniversary | Sakshi
Sakshi News home page

చాలా మిస్‌ అవుతున్నానమ్మా.. సోనూసూద్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Jul 21 2021 6:31 PM | Updated on Jul 21 2021 8:03 PM

Sonu Sood Shares Emotional Post For His Mother Birth Anniversary - Sakshi

మీరు లేకుండా నా జీవితంలో ఏర్పడిన శూన్యం నేను మిమ్మల్ని మళ్లీ చూసేవరకు ఎప్పుడూ అలాగే ఉంటుంది.

కరోనా కష్టకాలంలో దేవుడిలా వచ్చి నిరుపేదలను ఆదుకున్న ‘రియల్‌ హీరో ’సోనూసూద్‌.  కార్మికులు మొదలు.. రైతులు, నిరుద్యోగులు ఇలా ప్రతి ఒక్కరికి అడిగిన సాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫలానా చోట.. ఫలానా సమస్య ఉందన్న విషయం తన దృష్టికి వస్తే చాలు చేతికి ఎముక లేదన్నట్లుగా సాయం చేస్తున్నాడు. తాజాగా ఈ రియల్‌ హీరో తన తల్లి జయంతి సందర్భంగా ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు. 

‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ.. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విష్ చేయాలనుకుంటున్నాను. మీరు నాకు నేర్పించిన జీవిత పాఠాలకు ధన్యవాదాలు. ఈ మెసేజ్‏లు నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నానో.. ఎప్పటికీ వ్యక్తిపరచలేవు. మీరు లేకుండా నా జీవితంలో ఏర్పడిన శూన్యం నేను మిమ్మల్ని మళ్లీ చూసేవరకు ఎప్పుడూ అలాగే ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. అలాగే మీరు నాకు ఎల్లప్పుడు మార్గనిర్దేశం చేయండి’ అంటూ సోనూసూద్‌ ట్వీట్‌ చేశారు. కాగా, సోనూసూద్‌ తల్లి సరోజ్‌ సూద్‌ 2007లో కన్నుమూశారు. 2016లో సోనూసూద్‌ తండ్రిని కోల్పోయాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement