'నువ్వు నేర్పించిన విలువలతోనే బతుకుతున్నా'.. సోనూ సూద్ ఎమోషనల్! | Bollywood Actor Sonu Sood Emotional Note On His Mother Birth Anniversary | Sakshi
Sakshi News home page

Sonu Sood: ఎప్పటికీ ఆ మార్గంలోనే నడుచుకుంటా: సోనూ సూద్‌ ఎమోషనల్ పోస్ట్!

Published Sun, Jul 21 2024 1:57 PM | Last Updated on Sun, Jul 21 2024 3:19 PM

Bollywood Actor Sonu Sood Emotional Note On His Mother Birth Anniversary

బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌ ఎమోషనలయ్యారు. తన తల్లి సరోజ్ సూద్‌ జయంతి కావడంతో ఆమెను తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆమె ఫోటోను షేర్ చేస్తూ నోట్ రాసుకొచ్చారు.

సోనూ సూద్ ట్వీట్‌లో రాస్తూ..'హ్యాపీ బర్త్‌డే అమ్మా. నువ్వు లేని ఈ ప్రపంచం అందంగా లేదు. నువ్వు నేర్పించిన సూత్రాలు, నైతిక విలువలుతో నా జీవితాన్ని కొనసాగిస్తున్నా. నిన్ను చాలా ప్రేమిస్తున్నా అమ్మా. ఒక్కసారి నిన్ను ప్రేమగా హత్తుకుని ఎంతగా మిస్‌ అవుతున్నానో చెప్పాలనుంది. నువ్వు చూపించిన మార్గంలో ఎప్పటికీ నడుస్తూనే ఉంటా. లవ్‌ యూ సో మచ్‌' అంటూ పోస్ట్ చేశారు.

కాగా.. అరుంధతి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనూసూద్‌ పలు చిత్రాల్లో నటించారు. నటన మాత్రమే కాదు.. తనవంతుగా సమాజసేవలో దూసుకెళ్తున్నారు. సోనూ సూద్‌ అనే ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తన తల్లి సరోజ్‌ సూద్‌ పేరుతో స్కాలర్‌షిప్‌లు అందింస్తున్నారు. పేదరికంలో ఉన్న ఎందరో విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లాకు ఓ విద్యార్థికి సాయం అందించారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల ద్వారా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement