Saroj
-
'నువ్వు నేర్పించిన విలువలతోనే బతుకుతున్నా'.. సోనూ సూద్ ఎమోషనల్!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎమోషనలయ్యారు. తన తల్లి సరోజ్ సూద్ జయంతి కావడంతో ఆమెను తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ట్విటర్లో ఆమె ఫోటోను షేర్ చేస్తూ నోట్ రాసుకొచ్చారు.సోనూ సూద్ ట్వీట్లో రాస్తూ..'హ్యాపీ బర్త్‌డే అమ్మా. నువ్వు లేని ఈ ప్రపంచం అందంగా లేదు. నువ్వు నేర్పించిన సూత్రాలు, నైతిక విలువలుతో నా జీవితాన్ని కొనసాగిస్తున్నా. నిన్ను చాలా ప్రేమిస్తున్నా అమ్మా. ఒక్కసారి నిన్ను ప్రేమగా హత్తుకుని ఎంతగా మిస్ అవుతున్నానో చెప్పాలనుంది. నువ్వు చూపించిన మార్గంలో ఎప్పటికీ నడుస్తూనే ఉంటా. లవ్ యూ సో మచ్' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. అరుంధతి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనూసూద్ పలు చిత్రాల్లో నటించారు. నటన మాత్రమే కాదు.. తనవంతుగా సమాజసేవలో దూసుకెళ్తున్నారు. సోనూ సూద్ అనే ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన తల్లి సరోజ్ సూద్ పేరుతో స్కాలర్షిప్లు అందింస్తున్నారు. పేదరికంలో ఉన్న ఎందరో విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లాకు ఓ విద్యార్థికి సాయం అందించారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల ద్వారా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. Happy Birthday Maa. World without you is not that beautiful but somehow surviving with the principles and morals you taught me. I love u so much mom💔 wish I could hug you tight and tell you how much I miss you. Will always follow the path you showed me. Keep smiling till I see… pic.twitter.com/Bl1g5XNG3S— sonu sood (@SonuSood) July 21, 2024 -
‘మామ్ మ్యాజిక్ పికెల్ ఇండియా’ గా.. సరోజ్ ప్రజాపతి
"మధ్యప్రదేశ్‌కు చెందిన సరోజ్ ప్రజాపతికి వీరాభిమానులు ఉన్నారు. అలా అని ఆమె సెలబ్రిటీ కాదు. ‘ఆమె పచ్చడి చేస్తే పండగే’ అన్నట్లుగా ఉండేది. తనలోని టాలెంట్‌ను ‘ఎంటర్ ప్రెన్యూర్షిప్’లోకి కన్వర్ట్ చేసి, 19 సంవత్సరాల కుమారుడితో కలిసి ‘మామ్ మ్యాజిక్ పికెల్ ఇండియా’ను స్టార్ట్ చేసింది. నెలకు రెండు లక్షల రూపాయల వరకు సంపాదిస్తోంది. 30 మంది మహిళలకు ఉపాధిని ఇస్తోంది." మధ్యప్రదేశ్‌లోని షాదోర అనే గ్రామంలో తన ఇంటిలో కాలక్షేపం కోసం టీవీ చానల్స్ మారుస్తోంది సరోజ్. ఈ క్రమంలో ఆమె దృష్టి ఒక బిజినెస్ ప్రోగ్రాంపై పడింది. పచ్చళ్ల వ్యాపారంలో విజయం సాధించిన బిహార్‌లోని ఇద్దరు మహిళలకు సంబంధించిన ప్రోగ్రాం అది. ఈప్రోగ్రాం ఆసక్తిగా చూస్తున్నప్పుడు ‘నేను మాత్రం వ్యాపారం ఎందుకు చేయకూడదు!’ అనుకుంది తనలో తాను. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సరోజ్‌కు ‘శభాష్’ అని అందరూ అభినందించే పని ఏదైనా చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉండేది. కాని దారి ఏమిటో తెలిసేది కాదు. ‘దారి ఏమిటో తెలియాలి అంటే ముందు నీలో ఉన్న శక్తి ఏమిటో నీకు తెలియాలి’ అంటారు పెద్దలు. టీవీప్రోగ్రాం తనలోని శక్తి, నైపుణ్యాన్ని గుర్తు తెచ్చింది. కుమారుడు అమిత్ ప్రజాపతితో తనకు వచ్చిన ఆలోచనను చెప్పింది సరోజ్. పందొమ్మిది సంవత్సరాల అమిత్ ‘బ్రాండ్ బిల్డింగ్’ అనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. ‘మనకెందుకమ్మా వ్యాపారం. పెద్ద రిస్క్’ అనే మాట అమిత్ నోట వినిపించి ఉంటే కథ కంచికి వెళ్లి ఉండేది. గత సంవత్సరం ‘మామ్స్ మ్యాజిక్ పికిల్ ఇండియా’ పేరుతో ఊరగాయల వ్యాపారం మొదలుపెట్టింది సరోజ్. ‘మామ్స్ మ్యాజిక్ పికిల్ ఇండియా బ్రాండ్’ గురించి సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాడు అమిత్. ఆన్లైన్, ఆఫ్‌లైన్ డిమాండ్ల నేపథ్యంలో తమ ఇల్లు చాలదని దగ్గరలోని పెద్ద స్థలంలో ఊరగాయలు తయారు చేయడం ప్రారంభించారు. ‘అమ్మ దగ్గర సంప్రదాయ వంటకాలతో పాటు ఊరగాయలు తయారు చేయడం నేర్చుకున్నాను. అది నన్ను వ్యాపారవేత్తను చేస్తుందని ఊహించలేదు. ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది మామిడి కాయలు, కూరగాయలను స్థానికంగా కొనుగోలు చేస్తాను. ఊరగాయల తయారీలో రసాయనాలను ఉపయోగించం.’ అంటుంది సరోజ్. ‘మామిడి సీజన్లో మా ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు వెళుతున్నప్పుడు ఊరగాయ జాడీని తీసుకువెళతారు. ఊరగాయ రుచి చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అంటారు. ఇది గుర్తు తెచ్చుకొని మామ్ పికెల్స్ అనేది పర్ఫెక్ట్ బిజినెస్ ఛాన్స్ అనుకున్నాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లలో మా బిజినెస్‌కు సంబంధించిన పేజీలను క్రియేట్ చేశాను. మంచి స్పందన వచ్చింది. జాడీలను కొని లేబుల్స్ ప్రింట్ చేయించాను. మధ్యప్రదేశ్ నుంచే కాదు దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది’ అంటాడు అమిత్. పదిహేను సంవత్సరాల వయసులో తొలిసారిగా పచ్చి మామిడి కాయ పచ్చడి తయారు చేసి ఇంటిల్లిపాది ‘అద్భుతం’ అనేలా చేసింది సరోజ్. ఆనాటి ‘అద్భుతం’ ఇప్పటికీ అద్భుతాలు చేయిస్తూనే ఉంది. కేవలం మామిడికాయ ఊరగాయలతో మొదలైన వ్యాపారం అనతికాలంలోనే పచ్చిమిర్చి, నిమ్మకాయ, మిక్స్డ్ వెజిటబుల్... మొదలైన వాటిలోకి విస్తరించింది. అమ్మ చేతి నైపుణ్యానికి కుమారుడి డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ తోడు కావడంతో త్వరలోనే వ్యాపారం మంచి ఊపందుకుంది. నా కుటుంబం నా బలం! కుటుంబ సహాయసహకారాలు తోడైతే అవలీలగా విజయం సాధించవచ్చు అని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఊరగాయల వ్యాపారం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మా ఆయన, అబ్బాయి ప్రోత్సాహకంగా మాట్లాడారు. ‘నువ్వు రుచి మీద దృష్టి పెట్టు చాలు. మిగిలినవి మేము చూసుకుంటాం’ అని ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు. ఒక టీవీ ప్రోగ్రాంలో విజేతల మాటలు విని ఆ స్ఫూర్తితో నేను కూడా వ్యాపారంలోకి దిగాను. దీనికి కారణం అప్పటికప్పుడు వచ్చిన ఉత్సాహం కాదు. నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనే పట్టుదల. నా వల్ల ఇతర మహిళలు కూడా ఉపాధి పొందడం సంతోషంగా ఉంది. – సరోజ్ ప్రజాపతి ఇవి చదవండి: Ameen Sayani: పాటల పూలమాలి వెళ్లిపోయాడు..! -
గల్లీ క్రికెట్
బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించనున్న చిత్రం ‘పరాక్రమం’. బీఎస్కే మెయిన్ స్ట్రీమ్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం ప్రీ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘గోదావరి జిల్లాలో లంపకలోవ గ్రామంలోని లోవరాజు అనే యువకుడి జీవితంలో జరిగే గల్లీ క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేమ, నాటక రంగ జీవితం, రాజకీయం.. వంటి అంశాలు ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ, ఎడిటర్, సంగీతం, నిర్మాణం–దర్శకత్వం: బండి సరోజ్ కుమార్. -
నెలల చిన్నారితో అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే
-
‘వర్చువల్ స్కూల్’పై కేంద్రం, కేజ్రీవాల్ వాదులాట
న్యూఢిల్లీ: ‘వర్చువల్ స్కూల్’పై కేంద్రం, కేజ్రీవాల్ సర్కారు వాదనలకు దిగాయి. దేశంలో మొట్ట మొదటి వర్చువల్ స్కూల్‌ను బుధవారం ప్రారంభించినట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా దీన్ని ప్రారంభించామని ఆయన చెప్పుకొచ్చారు. 9వ తరగతికి ప్రవేశ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు లైవ్ క్లాసులకు హాజరుకావొచ్చని.. రికార్డు చేసిన పాఠాలు, స్టడీ మెటీరియల్ కూడా వారికి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకూ సాయం అందిస్తామని చెప్పారు. గతేడాదే ప్రారంభించాం కేజ్రీవాల్ ప్రకటనపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐఓఎస్) స్పందించింది. దేశంలో మొట్ట మొదటి వర్చువల్ స్కూల్‌ను గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఎన్ఐఓఎస్ తెలిపింది. ‘మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా 2021, ఆగస్ట్ 14న వర్చువల్ స్కూల్‌ని ఎన్ఐఓఎస్ ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వం తాజాగా దీన్ని ప్రారంభించిందని చదివి నేను ఆశ్చర్యపోయాను. దేశంలోనే తొలిసారిగా జాతీయ స్థాయిలో దీన్ని మేము ప్రారంభించాం. ప్రస్తుతం 3వ సెషన్ జరుగుతోంద’ని ఎన్ఐఓఎస్ చైర్పర్సన్ సరోజ్ శర్మ తెలిపారు. వర్చువల్ స్కూల్ నిర్వహణలో ఢిల్లీ ప్రభుత్వానికి తమ సహాయం కావాలంటే తప్పకుండా చేస్తామన్నారు. అకడమిక్ సపోర్టు అందిస్తున్నాం తమకు అనుబంధంగా ఉన్న 7000 అధ్యయన కేంద్రాలు ప్రస్తుతం విద్యార్థులకు అకడమిక్ సపోర్టును అందిస్తున్నాయని ఎన్ఐఓఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. 1500 అధ్యయన కేంద్రాల ద్వారా నైపుణ్య ఆధారిత వృత్తి విద్యా కోర్సుల్లోనూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ అధ్యయన కేంద్రాల ద్వారా లైవ్ ఇంటరాక్టివ్ తరగతులు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 2.18 లక్షల అసైన్మెంట్లను అభ్యాసకులు అప్లోడ్ చేశారని తెలిపింది. ఇటీవల పూర్తయిన అకడమిక్ సెషన్లో 4.46 లక్షల అసైన్మెంట్లు, ట్యూటర్ మార్క్ అసైన్మెంట్(టీఎంఏ) అప్లోడ్ అయ్యాయి. సబ్జెక్ట్ నిపుణులచే మూల్యాంకనం చేసిన టీఎంఏ మార్కులు అభ్యాసకులకు వారి డాష్‌బోర్డ్‌లో కనిపిస్తాయని ఎన్ఐఓఎస్ వివరించింది. (క్లిక్: సిసోడియా అరెస్ట్ అయితే మరీ మంచిదన్న కేజ్రీవాల్) -
అమర ప్రేమ
-
జీవితంలో ఇంతటి ప్రేమ కూడా ఉంటుందా?
సాక్షి, న్యూఢిల్లీ : ఎంతటి అందమైన ముఖమైన యాసిడ్ పోస్తే ఎంత అందవికారంగా, వికతంగా మారుతుందో ఎవరైనా ఊహించలరు. యాసిడ్ దాడికి గురైనా బాధితులను ఇక ప్రత్యక్షంగా చూస్తే అందవికారం ఎంత వికృతంగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అలాంటి బాధితులను ప్రత్యక్షంగా చూడాలంటే గుండె ఎంతో దిటువుగా ఉండాలి. గుండెలో ఎంతో నిబ్బరం ఉండాలి. యాసిడ్ దాడి బాధితుల పట్ల ఎంత సానుభూతి ఉన్నా వారైనా బాధితుల వంక ఒక్కసారి చూస్తే అబ్బా! అంటూ ముఖం తిప్పేసుకుంటాం. మరోసారి అటువైపు చూడాలంటే మన ముఖం అష్ట వంకరలు తిరగడమే కాకుండా కడుపులో కూడా దేవేస్తుంది. ఓ యాసిడ్ దాడిలో ముఖమంతా వికృతంగా మారిన 26 ఏళ్ల బాధితురాలు ప్రమోదిని రౌల్‌ను సరోజ్ కుమార్ సాహు చూసి అందరిలాగే ముందుగా సానుభూతి చూపించారు. కాలిన గాయాలతో కాళ్లన్ని తొడల వరకు చీము పట్టి పడకకే పరిమితమైన రౌల్ లేచి నడిచేందుకు మరో నాలుగేళ్లు పడుతుందని వైద్యులు చెప్పినప్పుడు పిచ్చిదానిలా ఏడుస్తున్న ఆమె తల్లిని చూసి చలించి పోయారు. మనవంతు కర్తవ్యం నిర్వర్తిస్తే మనకళ్లముందే అమ్మాయి ఆశ్చర్యంగా కోలుకుంటుందని ఆ తల్లికి హితబోధ చేశారు. రెండు కళ్లుకూడా కనించక జీవితమంతా చీకటైందని తల్లి ఒడిలో తలపెట్టుకు ఏడుస్తున్న రౌల్‌ను కూడా తన శక్తిమేరకు ఓదార్చారు. అంగవైకల్యాన్నీ, మొత్తంగా జీవితాన్నే ఓ చాలెంజ్‌గా తీసుకొని నిలబడాలని మనోధైర్యాన్ని నూరిపోశారు. ప్రమోదిని రౌల్ త్వరగా కోలుకునేలా చేయడం కోసం సరోజ్ కుమార్ తాను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి రోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆస్పత్రిలో ఆమె పడక పక్కనే కూర్చొని ఆమెకు జీవితం పట్ల ఓ అందమైన భావం కలిగేలా కబుర్లు చెబుతూ వచ్చారు. ఇలా ఆయన మూడున్నర ఏళ్లపాటు అందించిన సేవలు ఫలించి ఆమె ఇప్పుడు తన కాళ్లమై నడవగలుగుతున్నారు. గత సెప్టెంబర్‌లో ఎడమ కంటికి ఆపరేషన్ కూడా చేయడంతో కొద్దిగా ఆమెకు చూపు కూడా వచ్చింది. ఇప్పటికీ ఆమె ముఖానికి ఐదు సర్జరీలు అయ్యాయి. మరో నాలుగు సర్జరీలు అవసరం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. కంటి చూపు కొద్దిగా రావడంతో ఆమె తన ముఖాన్ని అద్దంలో చూసుకునేందుకు ధైర్యం చేశారు. సరోజ్ కుమార్ ఇచ్చిన స్ఫూర్తితో కూడదీసుకున్న మనోధైర్యం ఒక్క సారిగా పగిలిన అద్దం వలే ముక్కలయింది. కుప్పకూలిపోయారు. ఇంత వికారంగా ఉన్న తనను ఎందుకు ప్రేమిస్తున్నావని ప్రశ్నించారు. వద్దంటూ బతిమాలారు. తోటి మనిషి పట్ల సానుభూతి, ప్రేమ ఉండడం సహజమన్నారు. ప్రేమకు చిహ్నమైన ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్దకు రౌల్‌ను తీసుకెళ్లినప్పుడు (2016, జనవరి 14న) చేసిన బాసల గురించి గుర్తు చేశారు. మొదట్లో సానుభూతి మాత్రమే ఉండేదని, ఇప్పుడు అది బలమైన ప్రేమగా మారిందని సరోజ్ కుమార్ సాహు చెప్పారు. అయినా ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు. జీవితాన్ని నిలబెట్టిన ఓ వ్యక్తి జీవితాన్ని తాను నాశనం చేయలేనని చెప్పారు. అయినా ఆమెకు నచ్చచెప్పిన సరోజ్, ఒడిశాలో ఒంటరైన తన తల్లితో ఇంతకాలం జీవిస్తూ వచ్చిన రౌల్‌ను తదుపరి చికిత్స కోసం తన వెంట ఢిల్లీ తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి ఏడాదిపాటు ఒకే ఇంటి కప్పు కింద జీవిస్తున్నారు. ఇప్పుడు వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ‘అసలు నా జీవితంలో ఇంత ఔన్నత్యం కలిగిన వ్యక్తిని నేను చూడడం ఇదే మొదటిసారి. నేను 15వ ఏట పదో తరగతి చదువుతున్నప్పుడు నాపై ఓ 28 ఏళ్ల యువకుడు యాసిడ్ దాడి చేశాడు. అప్పటి నుంచి మగాళ్లంటే మృగాళ్లగా ఊహించుకొని ద్వేషం పెంచుకున్నాను. నేను అప్పుడు ఎంతో అందంగా ఉండేదాన్ని. అందుకనే మా అమ్మ నన్ను రాణి అని పిలిచేది. అందుకనే ఆ యువకుడు నా వెంట పడ్డాడు. నేను ఛీత్కరించడంతో నా అందంపై పగబట్టి యాసిడ్ దాడి జరిపాడు. దాడి జరిగిన తర్వాత నాలుగు నెలల పాటు ఒడిశా ఆస్పత్రి ఐసీయులో ఉన్నాను. నాలుగేళ్లపాటు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అంటే, 2014, మార్చి నెలలో ఓ నర్సును చూడడం కోసం వచ్చిన సరోజ్‌తో పరిచయం అయింది. మొదట్లో ఆయన నన్ను చూసి చూడనట్లు వెళ్లిపోయేవారు. ఓ రోజున మా అమ్మ, నేను ఏడుస్తున్నప్పుడు తానే చొరవ తీసుకొని మమ్మల్ని ఓదార్చారు. 2016, జనవరిలో నన్ను తాజ్‌మహల్ తీసుకెళ్లినప్పుడు పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశారు. నేను ఒప్పుకోకున్నా ఒప్పించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానన్న ఆనందం నాకు జీవితం పట్ల రెట్టింపు ధైర్యాన్ని ఇస్తోంది’ అని రౌల్ తన కథను క్లుప్తంగా వివరించారు. దాదాపు 11 ఏళ్ల క్రితం రౌల్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఆమెకు చిన్పప్పుడే తండ్రి చనిపోవడంతో ఛాన్వ్ ఫౌండేషన్‌లో పనిచేస్తున్న ఆమె తల్లి ఆమెను పెంచింది. పదవ తరగతిలోనే ఆమెపై యాసిడ్ జరగడంతో చదువు అంతటితోనే ఆగిపోయింది. ఛాన్వ్ ఫౌండేషన్ అందించిన ఆర్థిక సహాయంతో ఆమె ఇంతకాలం ఖరీదైన శస్త్ర చికిత్సలు చేయంచుకున్నారు. ఇప్పుడు ఆమెకు ఢిల్లీలో అయ్యే వైద్య ఖర్చులను సరోజ్ కుమార్ ఎక్కడి నుంచి తెస్తారో ఆయనకే తెలియాలి. చేస్తున్న ఉపకారాన్ని చెప్పుకునే మనస్తత్వం కాదు ఆయనది. యాసిడ్ దాడితో మృగాళ్లను మగాళ్లుగా పిలుస్తున్న సమాజంలో మంచి మనస్తత్వంతో నిజమైన మగాడిగా ముందుకొచ్చి సరోజ్ కుమార్ మృగాళ్లకూడా కనువిప్పు కలిగిస్తున్నారు. -
మహిళా సంఘాలపై ఎమ్మెల్యే కక్ష సాధింపు
ఆత్మకూరు: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. పోలీసులు, అధికారులను ఉసిగొల్పి తమను ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఎమ్మెల్యే అండతో పోలీసులు, మునిసిపల్ కమిషనర్ రమేష్‌బాబు దౌర్జన్యం చేయడంతో ప్రియదర్శిని మహిళా సంఘం అధ్యక్షురాలు షఫివున్ స్పృహ కోల్పోయి ఆస్పత్రి పాలయ్యారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు పట్టణంలోని రామ్ రహీం రాబర్ట్ పట్టణ మహిళా సమాఖ్య పరిధిలో 36 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో ఆరు సంఘాలు ఎమ్మెల్యేకు మద్దతు తెలుపుతుండగా.. మిగిలిన 30 సంఘాలు వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డికి మద్దతుగా ఉన్నాయి. కాగా..కేవలం ఆరు సంఘాల మద్దతు ఉన్న సరోజ అనే మహిళను ఎమ్మెల్యే అండతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పట్టణ సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నిక చేశారు. సరోజ సోమవారం మునిసిపల్ కమిషనర్, పోలీసులను తీసుకెళ్లి మెప్మా కార్యాలయాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. కార్యాలయ తలుపులు మూసి ఉండడంతో తాళం పగులగొట్టేందుకు కమిషనర్ యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన సంఘాల సభ్యులు అక్కడికి చేరుకున్నారు. కమిషనర్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గొడవ జరగడంతో షఫివున్ స్పృహ కోల్పోయింది. ఆమెకు బీపీ పడిపోవడంతో వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం షఫివున్ మాట్లాడుతూ శిల్పా చక్రపాణిరెడ్డికి మద్దతు ఇస్తున్నారంటూ తమపై కక్ష సాధిస్తున్నారని వాపోయారు. సంఘాల్లో లక్షలాది రూపాయల పొదుపు డబ్బు ఉందని, వారికి అప్పగిస్తే అక్రమాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. -
ఈ విజయుడు ఆపద్బాంధవుడు!
ఆదర్శం కొన్ని విషాదాలు విషాదాలకు మాత్రమే పరిమితమైపోతాయి. కొన్ని విషాదాలు మాత్రం...సరికొత్త పనులకు శ్రీకారం చుట్టేలా చేస్తాయి. ముంబాయిలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేసే విజయ్ ఠాకూర్ తాను ట్యాక్సీ డ్రైవర్ కావాలని ఎప్పుడు అనుకొని ఉండరు. అవుతానని కూడా ఊహించి ఉండరు. విజయ్ జీవితంలో జరిగిన ఒక విషాదసంఘటన ఆయన చేస్తున్న వృత్తినే మార్చేసింది. 1982లో...మూడు నెలల గర్భిణి అయిన విజయ్ భార్య సరోజ్‌కు పొత్తికడుపులో నొప్పి మొదలైంది. తెల్లవారుజామున రెండు గంటల సమయం. భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి విజయ్‌కి ఒక్క ట్యాక్సీ కూడా కనిపించలేదు. ఇక చేసేదేమిలేక అందేరి రైల్వేస్టేషన్‌కు వెళ్లి చాలా ఎక్కువ ఛార్జీ చెల్లించి ఒక ట్యాక్సీని మాట్లాడుకొని భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో సరోజ్ గర్భం పోయింది. ఈ విషాదం విజయ్‌ని కుదిపేసింది. ‘‘నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు’’ అనుకున్నారు బలంగా మనసులో. తాను చేస్తున్న ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న విజయ్ ఆ తరువాత ఒక ఫియట్ కారు కొనుగోలు చేసి ట్యాక్సీ పరిమిట్ తెచ్చుకున్నారు. పేద రోగుల నుంచి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా తన ట్యాక్సీలో హాస్పిటల్‌కు తీసుకువెళ్లడం మొదలుపెట్టారు. తనకు ఏ సమయంలో ఫోన్ చేసినా ఆఘమేఘాల మీద బయలుదేరి వెళతారు విజయ్ ఠాకూర్. భద్రతతో కూడిన వైట్-కాలర్ ఉద్యోగాన్ని వదిలి విజయ్ ట్యాక్సీ డ్రైవర్‌గా మారడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆయన మంచితనాన్ని కొందరు వేనోళ్ల పొగిడారు. ‘నాలుగు రాళ్లు వెనకేసుకొని శేషజీవితాన్ని హాయిగా గడపకుండా ఎందుకీ కష్టం?’ అన్నవాళ్లే ఎక్కువమంది. ‘‘నా నిర్ణయం పట్ల ఎప్పుడూ ఒక్క నిమిషం కూడా పశ్చాత్తాపపడలేదు’’ అంటారు విజయ్. ‘‘ఫైర్‌ఫైటర్‌లా నేను ఎప్పుడూ ఎలార్ట్గా ఉంటాను’’ అని చెప్పే విజయ్ అవసరంలో, ఆపదలో ఉన్నవారి నుంచి కాల్ వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళతారు. ప్రైవేట్ అంబులెన్స్ ఛార్జీలు అందుబాటు ధరల్లో లేకపోవడం, ప్రభుత్వ అంబులెన్స్ సర్వీస్ అరుదుగా మాత్రమే అందుబాటులో ఉండడం కారణంగా తనలాంటి వారి సేవలు అవసరమవుతాయి అంటారు విజయ్. ఒకరోజు తెల్లవారుజామున రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదానికి గురైన ఒక కారును చూశారు విజయ్. ఆ కారులో ఎనిమిది నెలల కూతురితో ఉన్న దంపతులు కనిపించారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. తండ్రి, పసిబిడ్డలు ప్రాణాలతో బయటపడ్డా దురదృష్టవశాత్తు తల్లి మాత్రం చనిపోయింది. ఆమెకు చెందిన రెండు లక్షల విలువైన నగలను వైద్యులు విజయ్‌కు అందించారు. వాటిని హాస్పిటల్‌కు వచ్చిన బంధువులకు అప్పజెప్పారు విజయ్. విజయ్‌కి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడానికి వాళ్లు సిద్ధపడినా ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఇలా చెప్పుకుంటే పోతే...విజయ్‌లోని మంచితన గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఉదహరణలు ఉన్నాయి. ‘‘డబ్బు కోసం, ప్రచారం కోసం ఏ పనీ చేయను. నేను సహాయపడినవారు క్షేమంగా ఉంటే చాలు...ఆ తృప్తికి మించిన విలువ ఏముంటుంది?’’ అంటారు విజయ్. ఎప్పుడు ఏ అవసరం ముంచుకొచ్చినా అర్థరాత్రి అయినా అపరాత్రి అయినా ‘నేనున్నాను’ అంటూ తన ట్యాక్సీతో ప్రత్యక్షమై పేదల పాలిట ఆపద్బాంధవుడు అనిపించుకుంటున్నారు విజయ్ ఠాకూర్. -
తాకట్టు పెట్టడానికి వచ్చి చిక్కారు !
పట్టుబడ్డ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు చాంద్రాయణగుట్ట: ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలు చేస్తున్న ఓ ఘరానా గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను శాలిబండ పోలీసులు శుక్రవారం కటకటాల వెనక్కి నెట్టారు. చోరీ సొత్తు తాకట్టుపెట్టడానికి వచ్చిన వీరు అనూహ్యంగా పోలీసులకు చిక్కారు. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ, శాలిబండ అదనపు ఇన్స్పెక్టర్ నగేష్‌తో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... లాల్‌దర్వాజాకు చెందిన సంగీత (36) ఈ ఏడాది ఫిబ్రవరి 22న సంగారెడ్డిలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో చార్మినార్ వరకు బస్సులో వచ్చింది. అక్కడి నుంచి లాల్‌దర్వాజా రావడానికి ఆటో ఎక్కగా... ఇద్దరు మహిళలు అదే ఆటోలో ఎక్కారు. సంగీత పక్కన కూర్చున్న వారు ఆమెను అటు.. ఇటు నెట్టుతూ దృష్టి మళ్లించి బ్యాగ్ చోరీ చేశారు. ఆ బ్యాగ్‌లో 16 తులాల బంగారు నగలు ఉన్నాయి. శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్ షాప్ వద్ద సంగీత ఆటో దిగగా.. వెంటనే వారు కూడా దిగి వెళ్లిపోయారు. అనంతరం తన బ్యాగ్ చోరీకి గురైందని గుర్తించిన బాధితురాలు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సంగీత ఆటో దిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు మహిళలు బ్యాగ్ చోరీ చేసినట్టు గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం ఇద్దరు మహిళలు లాల్‌దర్వాజా మోడ్ వద్ద నగలతో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... ఓ ఘరానా దొంగల ముఠాకు చెందిన అక్కాచెల్లెళ్లు కావడి సరోజ (38), మేకల దుర్గ(40) అని తేలింది. వీరిది కడపజిల్లా సాయింపేట. పలుసార్లు జైలుకెళ్లి వచ్చారు. కాగా, ఆటోలో సంగీత నగలను చోరీ చేసింది వీరేనని తేలింది. అప్పట్లో చోరీ చేసిన నగలను ఇప్పుడు తాకట్టు పెట్టడానికి వచ్చి పోలీసులకు చిక్కారు. ఇద్దరి వద్ద నుంచి 13.1 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఆడపిల్లని..
సరోజ..(పేరు మార్చాం) ముగ్గురు ఆడపిల్లల్లో ఆఖరిది! ఆడపిల్లగా పుట్టినందుకు కళ్లు తెరిచిన నాటి నుంచే నిర్లక్ష్యానికి గురైంది! ఎంతగా అంటే తల్లిపాలకూ నోచుకోలేనంతగా! సరోజ పుట్టినప్పటి నుంచే ఆ పిల్లను వదిలించుకునే ప్రయత్నం చేశారు ఆమె తండ్రి, నానమ్మ. తల్లిని పాలివ్వనివ్వకుండా కట్టడి చేశారు. పాపకు మూడో నెల రాగానే అనాథాశ్రమంలో చేర్పించి కొడుకును కనాలని.. సరోజ నానమ్మ కోడలిని ఆజ్ఞాపించింది. కాళ్లు పట్టుకొని బతిమాలి ఆ గండం గట్టెక్కించుకుంది సరోజ తల్లి. ఆరో నెల రాగానే మళ్లీ అదే నస.. ఆ పిల్లను వదిలించుకొమ్మని. కొడుకును కనమని. అక్కను, పిల్లల్ని చూద్దామని వచ్చిన సరోజ మేనమామకు మొత్తం విషయం అర్ధమైంది. ఇదేం పద్ధతి అని బావని నిలదీస్తే.. ముగ్గురు ఆడపిల్లల్ని కని పెంచడానికి మీరేమీ మణులు, మాన్యాలు నాకు కట్టబెట్టలేదని బావమరిది మీదికి మీసాలు తిప్పాడు. పోషించుకోలేనప్పుడు కనడమెందుకని బావమరిదీ మాటమీరాడు. బావ గారికి కోపమొచ్చింది. ‘ఈ క్షణమే మీ అక్కను, పిల్లల్ని తీసుకొని నా ఇంట్లోంచి వెళ్లిపో. నెల తిరక్కుండానే ఇంకో పిల్లను పెళ్లి చేసుకొని.. పండంటి కొడుకుని కంటాను’ అని మర్యాద తప్పాడు. విషయం సరోజ అమ్మమ్మ తాతయ్యలు, నానమ్మ తాతయ్యల వరకు, అట్నుంచి పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లింది. పోలీసులు సరోజ నాన్న, నానమ్మ, తాతయ్యలకు కౌన్సెలింగ్ ఇచ్చి బుద్ధిగా ఉండాలని చెప్పారు. పోలీసుల భయంతో భార్యాపిల్లలను తీసుకుని ఇంటికెళ్లాడు సరోజ తండ్రి. బావ బుద్ధి ఎరిగిన బావమరిది ఒకరోజు సరోజను తనింటికి తెచ్చేసుకున్నాడు. అప్పుడు ఆ చంటిదాని వయసు యేడాది. ఇంటి విషయాన్ని ఠాణా దాకా తీసుకెళ్లారని సరోజ తల్లిని, మిగిలిన పిల్లలను గడప తొక్కనివ్వలేదు సరోజ తండ్రి... ఈ రోజుకీ!. మేనమామ ఇంట్లో.. అప్పటికే సరోజ మేనమామకు మూడేళ్ల ఆడపిల్ల. భార్య మనసు తెలుసుకోకుండానే మేనకోడలిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. కన్న కూతురిని ఒకలా.. మేనకోడలిని ఒకలా చూడ్డం మొదలుపెట్టిందామె. ఇక్కడా ఆ పసిదానికి పాలకు కరువే. భర్త ఉన్నప్పుడు బాగా చూసుకునేది. అతను ఆఫీస్‌కి వెళ్లగానే ఆ పిల్లను పట్టించుకునేది కాదు. ఈలోపే సరోజ మేనమామ భార్య మళ్లీ గర్భవతి అయింది. పిల్లలను చూసుకోవడానికి కష్టమవుతుంది అంటే సరోజ అమ్మమ్మ వచ్చింది. అప్పుడు తెలిసింది ఆమెకు సరోజను కోడలెలా చూస్తుందో. అయినా కిమ్మనలేదు. ‘కన్నతండ్రే కాదనుకొని వదిలేసిండు.. కోడలైతే పరాయింటి పిల్ల.. ఈమాత్రం చూడ్డం గొప్పే’ అని సర్దుకుంది. కోడలికీ రెండో కాన్పులో ఆడపిల్లే పుట్టింది. సరోజ తమింట్లో కాలు పెట్టడం వల్లే బిడ్డ పుట్టిందని కోడలు గగ్గోలు పెట్టింది. ఆ పిల్ల ఉన్న ఇంట్లో తానుండనని భర్తతో గొడవ పెట్టుకుంది. భవిష్యత్ అర్థమైన అమ్మమ్మ.. సరోజను తనతో తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు.. సరోజకు పదకొండేళ్లు. 65 ఏళ్ల అమ్మమ్మ, 70 ఏళ్ల తాతయ్య దగ్గర చిన్నప్పుడు కోల్పోయిన సుఖాన్ని ఆస్వాదిస్తోంది. అమ్మమ్మనే అమ్మా అని పిలుస్తుంది. తాతను పేరుపెట్టి గదమాయిస్తుంది. అయిదో తరగతి చదువుతోంది. అమ్మమ్మ, తాతయ్యలు కొంచెం ఖాళీగా కనిపించినా.. ఇద్దరికీ చెరో బలపం ఇచ్చి నేల మీద ఏబీసీడీలు రాయిస్తుంది చేతిలో బెత్తం పట్టుకొని. ‘మేమున్నంత వరకు ఈ పిల్లకు ఫరవాలేదు. మా తర్వాత ఎలా? అనుకున్నప్పుడే గుబులయితది’ అంటారు ఆ వృద్ధులు!. ..:: శరాది -
నరకం చూపించారు...
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... సమయం రాత్రి పన్నెండు దాటి ఇరవై నిమిషాలు అయ్యింది. ఎక్కడా ఏ అలికిడీ లేదు. ఊరు ఎప్పుడో నిద్రపోయింది. మేమొక్కళ్లమే మెలకువగానే ఉన్నాం అన్నట్టుగా ఎక్కడి నుంచో కీచురాళ్ల రొద మాత్రం వినిపిస్తోంది. ఎటు చూసినా చిక్కటి చీకటి. నా మనసు నిండా కూడా చీకటే ఉన్నందుకో ఏమో... ఈ చీకటి నన్ను అంతగా భయపెట్టడం లేదు. అందుకే వడివడిగా అడుగులు వేస్తున్నాను. గమ్యాన్ని చేరాలని త్వరపడుతున్నాను. కానీ ఒక్కసారిగా నా అడుగులు ఆగిపోయాయి. దూరంగా ఏదో వెలుతురు కనిపిస్తోంది. మెల్లగా నావైపే వస్తోంది. అది నా జాడనే వెతుకుతోందా అనిపించి ఒళ్లు ఝల్లుమంది. ఏం చేయాలి? ఎక్కడ దాక్కోవాలి? కంగారుగా అటూ ఇటూ చూశాను. ఓ ఇంటి ముందు ఇటుకలు కుప్పపోసి ఉన్నాయి. గబగబా వెళ్లి ఆ కుప్ప మాటున దాక్కున్నాను. వెలుతురు దగ్గర పడేకొద్దీ ఏదో శబ్దం చిన్నగా నా చెవులను సోకుతోంది. బైక్ అనుకుంటా. ఎవరో ఏమిటో. నా కోసమైతే రావడం లేదు కదా! భయంతో ఒళ్లంతా చెమట పోస్తోంది. కాసేపటి ఆ బైక్ నాకు దగ్గర పడింది. కానీ నన్ను పట్టించుకోకుండా తన దారిన తాను పోయింది. హమ్మయ్య అనుకుని పైకి లేవబోయాను. ఒక్కసారిగా శరీరం వశం తప్పింది. కాళ్లు తూలాయి. కళ్లు తిరిగాయి. పక్కనే ఉన్న అరుగుమీద కూలబడ్డాను. కళ్లు మసకబారుతున్నాయి. ఏమీ కనిపించడం లేదు. కొద్ది క్షణాల్లో... మైకం కమ్మింది. నాకు తెలీకుండానే నా స్పృహ తప్పింది. ‘‘అమ్మాయ్... లేమ్మా... లే’’... ఎవరివో మాటలు. అస్పష్టంగా వినిపిస్తున్నాయి. నన్ను ఉద్దేశించే అని అర్థమై, బలవంతంగా కళ్లు తెరిచాను. ఎదురుగా ఓ మహిళ. పొద్దున్నే కళ్లాపి చల్లడానికి వచ్చి, నేను అరుగుమీద పడివుండటం చూసి లేపింది. నేను కళ్లు తెరవగానే ‘‘ఎవరమ్మా నువ్వు?’’ అంది. ‘‘రాత్రి ఇలా వెళ్తున్నపుడు కళ్లు తిరిగి నట్టనిపిస్తే, ఇక్కడ కూర్చున్నాను. ఎప్పుడు స్పృహ తప్పిందో తెలియదు’’ అనేసి లేచాను. ఆమె ఇంకా ఏదో అడగబోయింది. నేను విననట్టే గబగబా అక్కడ్నుంచి కదిలాను. నాకు తెలుసు ఆమె ఏం అడుగు తుందో. అంత రాత్రిపూట రోడ్డుమీదికి ఎందుకొచ్చావ్, ఎందుకంత నీరసంగా ఉన్నావ్, ఒంటినిండా ఆ దెబ్బలేంటి... ఇలా చాలా ప్రశ్నలు సంధిస్తుందామె. వాటన్నిటికీ నా దగ్గర సమాధానాలు ఉన్నా... ఆమెకు చెప్పలేను. చెప్పాల్సినవాళ్లు వేరే ఉన్నారు. అక్కడికే బయలుదేరాను. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతుంటే కాళ్లు వణికాయి. పోలీస్ స్టేషన్‌కి వెళ్లడమంటే పరువు నష్టంగా ఫీలయ్యే మధ్య తరగతి కుటుంబంలో పుట్టినదాన్ని కదా! అలాగే ఉంటుంది మరి. కానీ ఏం చేయను! నా తలరాత నన్ను అక్కడికి లాక్కెళ్లింది. నా గుండెకోత నన్ను ఖాకీల సాయం కోరేలా చేసింది. ఈ పరిస్థితి ఏర్పడుతుందని ఆరు నెలల క్రితం నేను ఊహించనైనా లేదు.కోరింది క్షణాల్లో పొందేంత సంపన్నురాలిని కాకపోయినా, కోరుకున్నదాన్ని నాకు ఇచ్చేవరకూ విశ్రమించని గొప్ప తల్లిదండ్రులున్న అదృష్టవంతురాలిని నేను. ఒక్కగానొక్క కూతుర్ని కావడంతో నేనే లోకం అమ్మానాన్నలకి. నన్ను సంతోషంగా ఉంచడమే తమ ధ్యేయం అన్నట్లు బతికేవారు ఇద్దరూ. తానూ అలా చూస్తానని మాట ఇచ్చాకే నన్ను ఆనంద్ చేతిలో పెట్టారు. ఉన్నదంతా ఊడ్చి కట్నంగా ధారపోశారు. కానీ వాళ్లకేం తెలుసు... ఆనందం అతడి పేరులోనే కానీ, అతడితో ఉన్నవారికి ఉండదని! కట్నం చాల్లేదని వాళ్ల అమ్మ అంటుంది. కానుకలు సరిపోలేదని వాళ్ల అక్క అంటుంది. పైకి అనకపోయినా అతడిదీ అదే అభిప్రాయమని నాకు తర్వాత తెలిసింది. నాతో సరిగ్గా మాట్లాడేవాడే కాదు. నాలుగు కబుర్లు చెబుతా డేమోనని చూసి చూసి విసిగి నేనే మూగదాన్నయిపోయాను. తిట్టడానికి మాత్రమే నోరు తెరిచేవాడు. అప్పటికీ తృప్తి లేకపోతే చేయి లేపేవాడు. ఉండేకొద్దీ వంటింట్లో ఉండాల్సిన అట్లకాడ నా ఒంటిమీద తన గుర్తుల్ని మిగల్చడం మొదలు పెట్టింది. ఏమిటీ అన్యాయమని అడిగినందుకు నాలుగ్గోడల మధ్య నాకోసం జైలు తయారైంది. అమ్మానాన్నల్ని డబ్బు అడగనన్నందుకు నా బతుకు నరకమైంది. వాళ్ల కోరికలు నా ఒంటి మీద గాయాలుగా తేలాయి. వారి కఠిన హృదయాలు నా తనువుపై రక్తపు చారికల్ని ముద్రించాయి. ఇంతటి బాధనూ కడుపులో దాచుకున్నాను కాబట్టి నా కడుపు నిండుగా ఉంటుందనుకున్నారో ఏమో... తిండి పెట్టడం కూడా మానేశారు. ఒకపక్క ఆకలి బాధ, మరోపక్క గుండెల్ని నలిపేసే వ్యథ. నిస్సహాయంగా రోదించాను. అసహాయంగా అలమటించాను. ఏ క్షణాన గ్యాస్ సిలెండర్ పేలుతుందో, ఎక్కడ కిరోసిన్ నా ఒంటిని తడిపేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ బతికాను. చివరికి తెగించాను. ఎప్పటిలాగే ఆరోజు రాత్రి నామీద తన ప్రతాపాన్ని చూపించి వెళ్తూ, గది తలుపులు మూయడం మర్చిపోయాడు తను. అదే నా పాలిట వరమయ్యింది. మెల్లగా బయటపడ్డాను. ఎలాగో పోలీసుల దగ్గరకు వెళ్లి జరిగినదంతా వివరించాను. పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు. అయినా వాళ్లు బెదరలేదు. నేనే మంచిదాన్ని కాదన్నారు. నన్ను చెడ్డగా చిత్రించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ల రాక్షసత్వానికి సాక్ష్యంగా నలిగిన నా దేహం ఉంది కదా! అందుకే పోలీసులు వాళ్ల మాటలు నమ్మలేదు. వాళ్లను లోపలేసి, నన్ను అమ్మానాన్నల దగ్గరకు పంపించారు. సంతోషంగా బతుకుతుందనుకున్న తమ కూతురు అనుభవించిన నరకాన్ని తలచుకుని అమ్మానాన్నా నేటికీ కుమిలిపోతూనే ఉన్నారు. నాకు జరిగిన అన్యాయం కంటే, వాళ్లు పడుతోన్న బాధే నన్ను కుంగదీస్తోంది. జీవితాంతం కాపాడతాడనుకుని కూతుర్ని అల్లుడికి అప్పగిస్తారు తల్లిదండ్రులు. తమకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడన్న నమ్మకంతో భర్తకి తమ జీవితాన్నే ఇచ్చేస్తారు ఆడపిల్లలు. కాపాడాల్సింది పోయి కాటేస్తాడని ఎవరు మాత్రం ఊహిస్తారు? సుఖపెట్టడం మాని కష్టాల కొలిమిలో కాల్చేస్తాడని ఎవరు మాత్రం అనుకుంటారు? నా భర్తలాంటి స్వార్థపరులు, క్రూర మనస్కులు ఉన్నంత కాలం నాలాంటి ఆడపిల్లలు బలైపోతుంటారు. అభాగ్యులుగా మిగిలిపోతూనే ఉంటారు!! - సరోజ (గోప్యత కోసం పేర్లు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి