
ఆవిర్భావ దినోత్సవంలో రేవంత్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: దేశానికి పూర్వ వైభవం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి కోరారు. మంగళవారం గాంధీభవన్‌లో పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం ఘనం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండాను రేవంత్‌రెడ్డి ఆవిష్కరించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి 137 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. స్వాతంత్య్రం కోసం ఎంతో శ్రమించి.. శాంతియుత పోరాటంతో ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి చాటి చెప్పిందని గుర్తు చేశారు.
అలీన విధానం, హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం, ఫుడ్ సెక్యురిటీ, ఉపాధి హామీ, సాంకేతిక అభివృద్ధి అంతా కాంగ్రెస్‌తోనే సాధ్యమైందని వివరించారు. ప్రస్తుత పాలకులు కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బ తీయాలని చూస్తున్నారని, ఎందరు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి మట్టి అంటదని స్పష్టం చేశారు. కుటుంబం అంటూ లేని ప్రధాని మోదీ ఆడ పిల్లల పెళ్లి వయసు పెంచి దేశంలో అలజడి సృష్టించారన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు వీహెచ్, మధుయాష్కి, మల్లు రవి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment