సాక్షి, న్యూఢిల్లీ: సెర్చింజన్ దిగ్గజం గూగుల్ వరుస తప్పులతో అభాసుపాలు అవుతోంది. ఆ మధ్య నెహ్రూ సంబంధిత సమాచారానికి మోదీ ఫొటోను ఉంచి ట్రోలింగ్‌ను ఎదుర్కున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి పొరపాటే చేసింది.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 157వ జయంతి సందర్భంగా గూగుల్‌లో ‘భారత జాతీయ కవి’ పేరిట టాప్ ట్రెండింగ్‌ను సృష్టించింది. అయితే గూగుల్‌లో ఆ పేరుతో పరిశోధించిన వారు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. నోబెల్ గ్రహీత ఠాగూర్ ప్లేస్‌లో.. ఆధ్యాత్మిక వేత్త శ్రీ అరబిందో ఫోటో ప్రదర్శితమైంది. దీనికితోడు మే 9న ఠాగూర్ పుట్టిన రోజు అయితే... తేదీని మే 7 అని తప్పుగా చూపిస్తోంది. ఈ వ్యవహారంపై బెంగాలీలు మండిపడుతున్నారు. తప్పులు లేకుండా ప్రచురించటం గూగుల్‌కి సాధ్యం కాదా? అంటూ కొందరు నిలదీస్తున్నారు. మరికొందరు తమదైన శైలిలో సోషల్ మీడియాలో గూగుల్‌పై సెటైర్లు పేలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment