
వినితా శ్రీ, మోక్షిత
జూనియర్ యన్టీఆర్ ‘రామాయణం’ అనే బాలల చిత్రంలో రామునిగా కనిపించి కనువిందు చేశారు. అప్పుడు తారక్ వయసు 13 ఏళ్లు. పదమూడేళ్ల వయసులోపు పిల్లలే నటీనటులుగా గతంలో ‘దాన వీర శూర కర్ణ’ చిత్రాన్ని నందమూరి జానకిరామ్ తనయుడిని బాల నటుడిగా పరిచయం చేస్తూ ‘జగపతి’ వెంకటేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించారు. ఇలా అప్పుడప్పుడు చిన్న పిల్లల పౌరాణిక సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ‘బాలగోవిందం’ పేరుతో ఓ పౌరాణిక చిత్రానికి శ్రీకారం జరిగింది.
డా. ముళ్లపూడి హరిశ్చంద్ర దర్శకత్వంలో అరుణోదయ ఆర్ట్ క్రియేషన్స్‌పై తోలేటి వెంకట శిరీష నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల గిరులలో ఎందుకు వెలిశాడు? తిరుమలలో వెంకటేశుడు వెలవక ముందు జరిగిన సంఘటనలతో మా చిత్రం రూపుదిద్దుకోనుంది. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తాం’’ అన్నారు. ‘‘వ్యక్తిత్వ వికాస కోణంలో మన పురాణాల్ని స్వీకరించాల్సిన ఆవశ్యకత ఉందని, ఆధ్యాత్మిక సారంతో ఈ సినిమా రూపకల్పన మొదలుపెట్టా’’మని పాటల రచయిత వెనిగళ్ల రాంబాబు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మీర్, మాటలు: యడవల్లి, సంగీతం: సాలూరి వాసూరావు.
Comments
Please login to add a commentAdd a comment