
జానకిరామ్ భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి జానకిరామ్ భౌతికకాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ఆదివారం ఉదయం హరికృష్ణ నివాసానికి వెళ్లారు. నివాళి అనంతరం హరికృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జానకిరామ్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరోవైపు ఎన్టీఆర్ సతీమణి, వైఎస్ఆర్ సీపీ నేత లక్ష్మీపార్వతి కూడా జానకిరామ్ కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరికీ రాకూడడని కష్టమని, కన్న తల్లిదండ్రులకు ఈ ఘటన కోలుకోలేనిదన్నారు. హరికృష్ణ, ఆయన సతీమణికి భగవంతుడు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.